Advertisement

పోలీస్ అవతారం ఎత్తిన ఇద్దరు దొంగలు అరెస్ట్

By: chandrasekar Sat, 22 Aug 2020 02:40 AM

పోలీస్ అవతారం ఎత్తిన ఇద్దరు దొంగలు అరెస్ట్


కోదాడ పోలీసులు ఇద్దరు వ్యక్తులు నకిలీ పోలీస్ అవతారం ఎత్తిన దొంగలను అరెస్ట్ చేసి దోచుకున్న సొత్తును స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు జగ్గయ్యపేటకు చెందిన కార్ డ్రైవర్ శ్రీను, అక్కడే సిమెంట్ పరిశ్రమలో పని చేసే అంజి ఇద్దరు స్నేహితులు. కాగా, కరోనా నేపథ్యంలో పనులు తగ్గడంతో సులువుగా డబ్బులు సంపాదించాలనుకున్నారు. అందుకు నకిలీ పోలీస్ అవతారం ఎత్తారు. కార్లో వెళ్లి రోడ్డు పక్కన ఆపి వాహనాలు తనిఖీ చేసేవారు. కాగితాలు ఏవంటూ బెదిరించి సెల్ ఫోన్లు, డబ్బులు వసూలు చేసేవారు.

అంతే కాకుండా కాగితాలు అందుబాటులో లేని వారి బైకులను స్వాధీనం చేసుకొని ఎదో ఒక పోలీస్ స్టేషన్ కు రమ్మని చెప్పి బైక్ తీసుకువెళ్లేవారు. ఈ బైకుల వ్యవహారం అసలు పోలీసులకు తెలిసింది. కోదాడ రురల్ సీఐ శివరాంరెడ్డి ఆదేశాలతో శుక్రవారం రామాపురం అడ్డరోడ్డు వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులకు ఆ ఇద్దరిని కలిశారు. పోలీసులు వారిని ప్రశ్నించగా పొంతన లేని సమాధానాలు చెప్పారు. వారిని అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారణ చేశారు. దింతో నకిలీ పోలీస్ వ్యవహారం బాగోతం బయటపడింది. వారి నుంచి ఆరు బైక్ లు, 11సెల్ ఫోనులు స్వాధీనం చేసుకొన్నారు.

Tags :
|
|
|

Advertisement