Advertisement

  • డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తిని అరెస్టు చేసిన పోలీసులు

డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తిని అరెస్టు చేసిన పోలీసులు

By: chandrasekar Sat, 05 Sept 2020 09:43 AM

డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తిని అరెస్టు చేసిన పోలీసులు


ప్రస్తుతం బాలీవుడ్ లో సుశాంత్ మరణం తరువాత డ్రాగ్ మాఫియా పై అనేక వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. బాలీవుడ్ హీరోయిన్ రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ చక్రవర్తిని పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ కేసులో అతడితో పాటు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హౌస్ మేనేజర్ శామ్యూల్ మిరండాను పోలీసులు అరెస్టు చేశారు. డ్రగ్స్ మాఫియాతో లింకులు, డ్రగ్స్ వినియోగానికి సంబంధించి వారిద్దరినీ పోలీసులు శుక్రవారం సుదీర్ఘంగా ప్రశ్నించారు. అనంతరం వారిద్దరినీ అరెస్టు చేశారు. ఈ రోజు ఉదయం నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు షోవిక్ చక్రవర్తి, శామ్యూల్ మిరండా ఇళ్లను సోదాలు చేశారు.

ఇప్పుడు షోవిక్ చక్రవర్తి ఉంటున్న ఇంట్లోనే రియా చక్రవర్తి కూడా నివసిస్తోంది. మహిళా అధికారులు కూడా ఈ సెర్చ్ ఆపరేషన్‌లో పాల్గొన్నారు. అయితే, ఇది అన్ని కేసుల్లో జరిగినట్టే సహజంగా జరిగే సోదా ప్రక్రియ అని అధికారులు చెప్పారు. అయితే, వారి ఇంట్లో కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాలు, పత్రాలు లభించినట్టు తెలుస్తోంది. అంతకు ముందు ఇద్దరు డ్రగ్ డీలర్స్‌ను నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో అధికారులు అరెస్టు చేశారు. వారిలో జాయేద్ విలాత్రా, అబ్దుల్ బాసిత్‌ పారిహర్‌లను అరెస్టు చేశారు.

పొలిసు విచారణలో రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి ఫోన్ చెక్ చేసినప్పుడు వారు డిలీట్ చేసిన డేటాలో ఓ డ్రగ్ డీలర్ సమాచారం కూడా బయటపడింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రియురాలు రియా చక్రవర్తికి పారిహర్ మధ్య డ్రగ్స్ లింక్స్ ఉన్నట్టు అనుమానిస్తున్నారు. బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్‌లో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే, అది ఆత్మహత్య కాదని, అది హత్య అంటూ సుశాంత్ తల్లిదండ్రులు ఆరోపించారు. రియా చక్రవర్తి మీద ఆరోపణలు చేశారు. రియా చక్రవర్తి మాత్రం తనకేం సంబంధం లేదని చెబుతోంది.

సుశాంత్ మృతి కేసును మొదట మహారాష్ట్ర పోలీసులు, బీహార్ పోలీసులు విడివిడిగా విచారణ జరిపారు. అయితే, రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య కూడా వివాదాలు వచ్చాయి. ఈ క్రమంలో కేసును సీబీఐకి అప్పగించాలంటూ రియా చక్రవర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మరికొందరు కూడా అదే విజ్ఞప్తి చేయడంతో సుశాంత్ సింగ్ కేసును సీబీఐకి అప్పగించారు. అయితే, ఆత్మహత్య కేసును విచారిస్తున్న సమయంలో సుశాంత్ డ్రగ్స్ తీసుకుంటాడనే వార్త తెరపైకి వచ్చింది. దీంతో నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో రంగంలోకి దిగింది. డ్రగ్స్ లింకులను వెలికితీస్తోంది. విచారణలో కొత్త కొత్త విషయాలు చాలా బయట పడుతున్నాయి.

Tags :
|
|
|

Advertisement