Advertisement

పోకో ఎక్స్3 త్వరలో భారత్ లో లాంచ్

By: chandrasekar Tue, 15 Sept 2020 09:46 AM

పోకో ఎక్స్3 త్వరలో భారత్ లో లాంచ్


చాల కొత్త ఫోన్లు లాంచ్ అవుతున్న ఈ సమయంలో పోటీకి తగ్గట్టు పోకో ఎక్స్3 ఫోన్ భారత్ లో లాంచ్ చేయనున్నట్లు తెలిసింది. పోకో ఎక్స్3 ఎన్ఎఫ్‌సీ తాజాగా యూరోప్‌లో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. యూరోపియన్ లాంచ్ అయిన కొద్ది సేపటికే పోకో ఇండియా జనరల్ మేనేజర్ సి.మన్మోహన్ ట్వీటర్‌లో త్వరలో ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ చేయనున్నట్లు తెలిపారు. ఇప్పుడు పోకో ఎక్స్3 స్మార్ట్ ఫోన్ సెప్టెంబర్ 22వ తేదీన లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు వస్తున్న లీకుల ప్రకారం సెప్టెంబర్ 22వ తేదీన ఈ ఫోన్ మనదేశంలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ధర మనదేశంలో రూ.18,999 లేదా రూ.19,999గా ఉండే అవకాశం ఉందని లీకుల ద్వారా తెలుస్తోంది.

ఈ ఫోన్ ఇండియా వేరియంట్లో పెద్ద బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. గ్లోబల్ వేరియంట్లో 5160 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇంతకంటే పెద్ద బ్యాటరీ అంటే 6000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. దీంతో ఈ ఫోన్ శాంసంగ్ ఎం31ఎస్, ఒప్పో ఎఫ్17 ప్రో వంటి ఫోన్లతో పోటీ పడే అవకాశం ఉంది. ఈ ఫోన్ గ్లోబల్ వెర్షన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. వీటిలో 6 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 229 యూరోలుగా (సుమారు రూ.19,900) గా ఉంది. 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 269 యూరోలుగా (సుమారు రూ.23,400) నిర్ణయించారు. మన దేశంలో వీటి ధరలలో కొంచం మార్పు ఉండవచ్చని తెలుస్తుంది.

పోకో ఎక్స్3 వివరాలు:

* పోకో ఎక్స్3 ఎన్ఎఫ్‌సీ గ్లోబల్ వేరియంట్లో 6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ గా ఉంది.

* ఆక్టా కోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్ పై ఈ ఫోన్ పనిచేయనుంది.

* ఇందులో 12 జీబీ ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు. దీన్ని మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా 256 జీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది.

* ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరాగా 64 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న సోనీ ఐఎంఎక్స్682 సెన్సార్ ను అందించారు. 13 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ లు కూడా ఇందులో ఉన్నాయి.

* సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 20 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

* ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఎంఐయూఐ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది.

* దీనిలో 4జీ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్/ఏ-జీపీఎస్, యూఎస్ బీ టైప్-సీ పోర్టు, ఎన్ఎఫ్ సీ, ఐఆర్ బ్లాస్టర్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

* దీని బ్యాటరీ సామర్థ్యం 5,160 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.

కానీ మన దేశ వేరియంట్లో ఇంకా పెద్ద బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఇందులో అందించారు. ఈ ఫోన్ ఐపీ53 రేటింగ్ తో లాంచ్ అయింది. దీనికోసం యువతులు పోటీపడవచ్చని తెలిపారు.

Tags :

Advertisement