Advertisement

  • స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో నుంచి పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్ రిలీజ్...

స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో నుంచి పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్ రిలీజ్...

By: chandrasekar Thu, 19 Nov 2020 3:01 PM

స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో నుంచి పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్ రిలీజ్...


చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో నుంచి మరో స్మార్ట్‌ఫోన్ లాంచ్ అవనుంది. పోకో ఎం3 లాంచ్ చేస్తున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 24న పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్ ఇండియాలో రిలీజ్ కానుంది.

పోకో నుంచి ఇప్పటికే ఎం సిరీస్‌లో పోకో ఎం2, పోకో ఎం2 ప్రో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే సిరీస్‌లో మూడో స్మార్ట్‌ఫోన్‌ను పోకో ఎం3 పేరుతో లాంఛ్ చేయనుంది.

పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్‌కు ప్రత్యేకతలు, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ గురించి కంపెనీ అధికారికంగా ఏమీ ప్రకటించలేదు. కేవలం రిలీజ్ డేట్ మాత్రమే వెల్లడించింది.

నవంబర్ 24న సాయంత్రం 5.30 గంటలకు వర్చువల్ ఈవెంట్ ద్వారా పోకో ఎం3 రిలీజ్ కానుంది. అయితే రెడ్‌మీ నోట్ 10 రీబ్రాండెడ్ వర్షన్‌ను పోకో ఎం3 పరిచయం చేయొచ్చన్న వార్తలు వినబడుతున్నాయి.

ఇప్పటికే రెడ్‌మీ 9 ప్రైమ్ స్మార్ట్‌ఫోన్‌ను పోకో ఎం2 పేరుతో రీబ్రాండ్ చేసిన సంగతి తెలిసిందే. పోకో ఎం3 విషయంలో కూడా అదే జరగొచ్చని భావిస్తున్నారు.

Tags :

Advertisement