Advertisement

  • ఆరో విడత హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటిన పోచంపల్లి శ్రీనివాస్‌

ఆరో విడత హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటిన పోచంపల్లి శ్రీనివాస్‌

By: chandrasekar Fri, 26 June 2020 4:02 PM

ఆరో విడత హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటిన పోచంపల్లి శ్రీనివాస్‌


తెలంగాణ ఆరో విడత హరితహారం సి.ఎం.కెసిఆర్ మొదలుపెట్టారు. ఈ సంధర్బంగా హరిత తెలంగాణ లక్ష్యంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా నేడు హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ పోచంపల్లి పాల్గొని మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు హరితహారం కార్యక్రమం ఒక మహాయజ్ఞంలా జరగాలన్నారు. ఇందుకులో భాగంగా ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు.

భావితరాలకు హరిత తెలంగాణను బహుమతిగా ఇవ్వడమే ఈ కార్యక్రమం ముఖ్య లక్ష్యమన్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించాలని అప్పుడే హరిత తెలంగాణ కల సాధ్యమౌతదన్నారు. మొక్కలు నాటడం వల్ల పర్యావరణానికి, జీవ వైవిధ్యానికి, వాతావరణ సమతుల్యతకు ఎంతో దోహద పడుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ వై.సతీష్‌ రెడ్డి, జడ్పీటీసీ గుడి వంశీధర్‌ రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువజన నాయకులు తూము హరీష్‌ పటేల్‌, గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ కో ఆర్డినేటర్‌ రాఘవ, టీఆర్‌ఎస్వీ రాష్ట్ర నాయకులు కిషోర్‌ గౌడ్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Advertisement