Advertisement

నేడే కొత్త పార్లమెంట్ భవనానికి భూమి పూజ ...

By: Sankar Thu, 10 Dec 2020 09:27 AM

నేడే కొత్త పార్లమెంట్ భవనానికి భూమి పూజ ...


దేశ రాజధాని ఢిల్లీలోని సంసద్‌ మార్గ్‌లో నూతన పార్లమెంట్‌ భవన నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం భూమి పూజ చేయనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పునాది రాయి వేయనున్నారు.

ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ వెంకటేశ్‌ జోషీ, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ నారాయణసింగ్‌ తదితరులు పాల్గొంటారు. మొత్తం 200 మంది అతిథులు హాజరవుతారని అధికారులు చెప్పారు.

ఇక ఈ కొత్త భవనంలో లోక్‌సభలో 888 మంది, రాజ్యసభలో 384 మంది ఎంపీలు కూర్చునేలా నిర్మిస్తున్నారు. ఇక, పార్లమెంట్‌ ఉభయసభల సంయుక్త సమావేశం జరిగితే 1,224 మంది ఎంపీలు పక్కపక్కనే కూర్చునేలా ఏర్పాట్లు చేస్తున్నారు.2022 నాటికి ఈ భవనం అందుబాటులోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Tags :
|

Advertisement