Advertisement

  • ట్రంప్ కరోనా నుంచి కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని మోడీ

ట్రంప్ కరోనా నుంచి కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని మోడీ

By: Sankar Fri, 02 Oct 2020 2:36 PM

ట్రంప్ కరోనా నుంచి కోలుకోవాలని ఆకాంక్షించిన ప్రధాని మోడీ


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కరోనా బారిన పడటంతో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. తన మిత్రుడు, ఆయన భార్య త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్ చేశారు.

ట్రంప్, మెలానియా ట్రంప్ మంచి ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటానన్నారు. ట్రంప్ ఉన్నత సలహాదారు హోప్ హిక్స్ కు తాజాగా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ట్రంప్ , మెలానియా ట్రంప్ కు నిర్వహించిన పరీక్షల్లో వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో తాను మెలానియా క్వారంటైన్ లో ఉంటూ తక్షణమే చికిత్స ప్రారంభిస్తామని ట్రంప్ ట్విటర్ ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే..

కాగా అటు ముంచుకొస్తున్నఅమెరికా అధ్యక్ష ఎన్నికలు తరుణంలో ట్రంప్ వైరస్ బారిన పడటంతో రిపబ్లికన్ పార్టీ ఆందోళన పడిపోయింది. ప్రధాన ప్రత్యర్థి బైడెన్ ప్రచారంలో దూసుకుపోతూ, సవాలు విసురుతోంటే.. ట్రంప్ మహమ్మారి సోకి క్వారంటైన్ నిబంధనలకు పరిమితం కావడం భారీ ప్రభావాన్ని చూపనుందని భావిస్తున్నాయి..

ఇక ట్రంప్ కూడా కరోనా నిర్ధారణ అయిందని ట్రంప్ ట్వీట్ చేసిన మరుక్షణం మార్కెట్లో సెంటిమెంటు దెబ్బతింది. ఇన్వెస్టర్ల అమ్మకాలతో నష్టాల్లోకి జారుకున్నాయి. రానున్న అధ్యక్ష ఎన్నికల ప్రచార హోరు మొదలైన తరుణంలో ట్రంప్ వ్యాధి పరినపడటంతో రిపబ్లిక్‌ పార్టీ ఆందోళనలో పడిపోయింది. డౌ ఫ్యూచర్స్ 500 పాయింట్లు, నాస్ డాక్ ఫ్యూచర్స్1.7 శాతం పడిపోయాయి. బంగారం కూడా 0.55 శాతం క్షీణించి,ఔన్సు దర 1,894.60 డాలర్లకు చేరుకుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ట్రంప్ కరోనా బారిన పడటంతో పెట్టుబడిదారుల్లో ఆందోళన నెలకొంది

Tags :
|

Advertisement