Advertisement

  • డిసెంబర్ 10 న కొత్త పార్లమెంట్ భవనానికి భూమిపూజ

డిసెంబర్ 10 న కొత్త పార్లమెంట్ భవనానికి భూమిపూజ

By: Sankar Sun, 06 Dec 2020 07:21 AM

డిసెంబర్ 10 న కొత్త పార్లమెంట్ భవనానికి భూమిపూజ


ఢిల్లీలో కొత్త పార్లమెంట్‌ భవనాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే.. అయితే.. పార్లమెంటు కొత్త భవన శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 10వ తేదీన భూమిపూజ చేయనున్నారు.

ప్రధాని మోదీ ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్నారు. సుమారు 22 నెలల పాటు పార్లమెంట్‌ భవన నిర్మాణ పనులు జరగనున్నాయి. దీని కోసం అక్కడ సౌండ్‌ ప్రూఫ్‌ వాల్‌ను నిర్మించనున్నారు. రూ .861.9 కోట్ల వ్యయంతో 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నాలుగంతస్తుల భారీ రాజ సౌధం నిర్మించనున్నారు.

టాటా సంస్థ పార్లమెంట్‌ నిర్మాణ బాధ్యతలు తీసుకుంది. కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణం సందర్భంగా ప్రస్తుతం పార్లమెంట్‌ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహాన్ని తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్లమెంట్‌ నిర్మాణం పూర్తి అయిన తర్వాత మళ్లీ మహాత్ముడి విగ్రహాన్ని కీలకమైన ప్రదేశంలో ప్రతిష్టించనున్నారు.

Tags :
|

Advertisement