Advertisement

  • రైతుల చిరకాల డిమాండ్లు ఈ రైతు చట్టాలతో తీరుతాయి ...ప్రధాని మోడీ

రైతుల చిరకాల డిమాండ్లు ఈ రైతు చట్టాలతో తీరుతాయి ...ప్రధాని మోడీ

By: Sankar Mon, 30 Nov 2020 06:20 AM

రైతుల చిరకాల డిమాండ్లు ఈ రైతు చట్టాలతో తీరుతాయి ...ప్రధాని మోడీ


తమ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రైతు చట్టాలు అన్నదాతలకు అత్యంత ప్రయోజనకరమని ప్రధాని మోదీ అన్నారు. వారి చిరకాల డిమాండ్లు ఈ చట్టాలతో తీరుతున్నాయని ఆయన చెప్పారు.

వీటి పట్ల నిరసన వ్యక్తం చేస్తూ, వీటిని ఉపసంహరించాలని కోరుతూ పంజాబ్, హర్యానా, తదితర రాష్ట్రాల నుంచి వేలమంది రైతులు ఛలో ఢిల్లీ పేరిట హస్తినకు చేరుకున్న నేపథ్యంలో.. మోదీ తన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ఈ చట్టాల గురించి ప్రస్తావించారు. ఈ వ్యవసాయ సంస్కరణలు మన రైతులకు నూతన కవాటాలను తెరిచాయని, వారి జీవన వికాసానికి తోడ్పడుతున్నాయని ఆయన చెప్పారు.

తమ పంటలకు గిట్టుబాటు ధరలు లభించేలా చూడాలని, దళారుల నుంచి తమను కాపాడాలని ఎన్నో ఏళ్లుగా అన్నదాతలు కోరుతున్నారని, వారి కష్టాలను తొలగిస్తామని తాము హామీ ఇచ్చామని, అలాగే ఈ చట్టాలను అమలులోకి తెచ్చామని మోడీ పేర్కొన్నారు.

Tags :
|

Advertisement