Advertisement

  • ఇండో పాక్ యుద్దానికి నేటితో యాబై ఏళ్ళు ...నివాళులు అర్పించిన పీఎం మోడీ

ఇండో పాక్ యుద్దానికి నేటితో యాబై ఏళ్ళు ...నివాళులు అర్పించిన పీఎం మోడీ

By: Sankar Wed, 16 Dec 2020 12:18 PM

ఇండో పాక్ యుద్దానికి నేటితో యాబై ఏళ్ళు ...నివాళులు అర్పించిన పీఎం మోడీ


బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం కలిగించిన 1971 ఇండో-పాక్‌ యుద్దానికి నేటితో 50 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద నివాళులర్పించారు.

యుద్ధంలో మరణించిన జవాన్లకు సంఘీభావంగా స్వర్ణ విజయజ్యోతిని వెలిగించారు. కాగా ఈ స్వర్ణ విజయజ్యోతిని 1971 యుద్ధం తర్వాత పరమ్‌వీర్‌ చక్ర, మహావీర్‌ చక్ర పురస్కార గ్రహీత గ్రామాలతో పాటు దేశవ్యాప్తంగా పలు ప్రదేశాలకు తీసుకెళ్లనున్నారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింఘ​, చీఫ్‌ ఆప్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ పాల్గొని అమరవీరులకు నివాళులు అర్పించారు. కాగా ఈ ఏడాదితో భారత్‌ విజయానికి 50 ఏళ్ల పూర్తయిన సందర్భంగా స్వర్ణ విజయ సంవత్సరంగా పేర్కొంటూ దేశవ్యాప్తంగా వేడుకలను నిర్వహించనున్నట్లు రక్షణశాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Tags :
|

Advertisement