Advertisement

  • ప్రధాని మోడీ జీవిత కథ మ‌నో విరాగి ఫస్ట్ లుక్ విడుదల

ప్రధాని మోడీ జీవిత కథ మ‌నో విరాగి ఫస్ట్ లుక్ విడుదల

By: Sankar Thu, 17 Sept 2020 4:23 PM

ప్రధాని మోడీ జీవిత కథ  మ‌నో విరాగి ఫస్ట్ లుక్ విడుదల

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రం మ‌న్ భైరాగి. తెలుగులో మ‌నో విరాగి పేరుతో విడుద‌ల కానుంది. ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత సంజ‌య్ లీలా బ‌న్సాలీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మోదీ 70వ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా టాలీవుడ్ న‌టుడు ప్ర‌భాస్ తెలుగు వెర్ష‌న్ పోస్ట‌ర్ ను విడుద‌ల చేశాడు. పోస్ట‌ర్ లో ఓ వైపు మోదీ యువ‌కుడి లుక్ క‌నిపిస్తుండ‌గా..మరోవైపు ఓ వ్య‌క్తి బ్యాగు వేసుకుని మ‌ట్టి రోడ్డుపై నుంచి న‌డుచుకుంటూ వ‌స్తున్నాడు.

ప్ర‌త్యేక‌మైన రోజున ఓ ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తిపై ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత సంజ‌య్ లీలా నిర్మిస్తున్న సినిమా ఫస్ట్ లుక్ ను విడుద‌ల చేయ‌డం లాంఛ్ చేయ‌డం సంతోషంగా ఉంది. ప్ర‌ధాని మోదీ గురించి ప్ర‌జ‌ల‌కు తెలియ‌ని క‌థ ఇది. సంజ‌య్ త్రిపాఠి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. మ‌రోవైపు ఈ మూవీ హిందీ పోస్ట‌ర్ ను అక్ష‌య్ కుమార్ లాంఛ్ చేశాడు.

కాగా ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా దేశం మొత్తం అన్ని వైపులా నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి..రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్, ఉప‌రాష్ర్ట‌ప‌తి వెంకయ్య‌నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంద‌ర్భంగా రాష్ర్ట‌ప‌తి, ఉప‌రాష్ర్ట‌ప‌తి ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. భ‌గ‌వంతుడు మిమ్మ‌ల్ని ఎల్ల‌ప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉంచాల‌ని ప్రార్థిస్తున్న‌ట్లు తెలిపారు. భార‌త‌దేశ జీవ‌న విలువ‌లు పాటిస్తూ, ప్ర‌జాస్వామ్య సాంప్ర‌దాయ ఆద‌ర్శాన్ని ప్ర‌ద‌ర్శిస్తూ దేశాన్ని అంత‌ర్జాతీయంగా ఉన్న‌త‌స్థానానికి తీసుకెళ్లారని కొనియాడారు. మోదీ నాయకత్వంలో ఆత్మనిర్భరతతో కూడిన నవభారత నిర్మాణ స్వప్నం సాకారం దిశగా సాగుతుండటం ముదావహం అన్నారు.

Tags :
|
|

Advertisement