Advertisement

ప్రధాని మోదీని ఆకట్టుకున్న చిన్నారి గేయం..!

By: Anji Mon, 02 Nov 2020 05:09 AM

ప్రధాని మోదీని ఆకట్టుకున్న చిన్నారి గేయం..!

ఈ చిన్నారి ప్రధాని మోదీని మొప్పించింది. ఈ చిన్నారి పాడిన వందేమాతర గీతం ప్రధాని మోదీని విపరీతంగా ఆకట్టుకుంది. మిజోరంకు చెందిన నాలుగేళ్ల ఎస్తేర్‌ హమ్నాటే పాడిన పాటకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జొరమ్‌తంగాతోపాటు లక్షల మంది హృదయాలను గెలుచుకుంది.

ఆ వీడియోను మిజోరం ముఖ్యమంత్రి… ప్రధాని మోదీకి షేర్‌ చేశారు. కాగా మోదీ ఆ వీడియోను రీట్వీట్‌ చేస్తూ బాలికను ప్రశంసించారు. ఎస్తేర్‌ హమ్నాటేని చూస్తే గర్వంగా ఉందని అన్నారు. ‘మా తుజే సలామ్‌’ అంటూ ఏ.ఆర్‌ రెహమాన్‌ పాడిన పాటను పాడి అప్‌లోడ్‌ చేసింది.

అంతకుముందు ఈ వీడియోను చూసిన ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ కూడా బాలికను మెచ్చుకున్నారు. ఈ వీడియోను ఈ ఏడాది అక్టోబర్‌ 25న ఎస్తేర్‌కు చెందిన యూట్యూబ్‌ ఛానల్‌లో అప్‌లోడ్‌ చేశారు.

ప్రియమైన సోదరీసోదరులారా.. మనం భారతీయులమై జన్మించినందుకు గర్వపడాలి…. ఇది ప్రేమ, ఆప్యాయత కలగలిసిన నేల. ఎన్నో భాషలు, సంస్కృతులు, జీవనశైలులతో ముడిపడిఉన్న దేశం. మాతృభూమికి ఉత్తమ సంతానంగా నిలిచేందుకు కలిసి నడుద్దాం అని వీడియో డిస్క్రిప్షన్‌లో పేర్కొన్నారు.

Tags :

Advertisement