Advertisement

  • వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి... మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ

వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి... మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ

By: Sankar Sun, 27 Sept 2020 2:36 PM

వ్యవసాయ బిల్లులపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి...  మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ


ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ నెల 28వ తేదీన షహీద్ భగత్ సింగ్ జయంతి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆయన సేవలను గుర్తు చేసుకొన్నారు.

అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ..ఆత్మనిర్భర భారత్‌ లో రైతులదే కీలకపాత్ర అని తెలిపారు. రైతులు పండించిన పంటలను మార్కెట్‌ కమిటీలకు తెచ్చి అమ్ముకోవడం ద్వారా రైతులు కొన్ని రాష్ట్రాల్లో లాభాలు ఆర్జిస్తారని తెలిపారు. కరోనా సమయంలో మన వ్యవసాయ రంగం తన సత్తా చాటిందని...స్వావలంబన భారతాన్ని నిర్మించే ప్రయత్నంలో రైతులు కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రధాని కొనియాడారు. కొత్త బిల్లులతో కనీస మద్దతు ధరకు నష్టం వాటిల్లదని..దీనిపై ప్రతిపక్షాలు దృష్పచారం చేస్తున్నాయని మోడీ ఫైర్‌ అయ్యారు.

మహాత్మాగాంధీ సిద్ధాంతాన్ని కాంగ్రెస్‌ పాటించి ఉంటే...స్వావలంబన భారత్‌ నినాదం అవసరముండేదే కాదని... భారత్‌ కొన్ని సంవత్సరాల కిందటే స్వావలంబన భారత్‌ గా ఎదిగి ఉండేదని పేర్కొన్నారు. ఇది ఇలా ఉండగా...కేంద్రం తెచ్చిన వ్యవసాయ బిల్లులను ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే...

Tags :
|
|

Advertisement