Advertisement

  • ఏపీ సీఎం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన పీఎం మోడీ , మెగాస్టార్ చిరు

ఏపీ సీఎం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన పీఎం మోడీ , మెగాస్టార్ చిరు

By: Sankar Mon, 21 Dec 2020 12:41 PM

ఏపీ సీఎం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన పీఎం మోడీ , మెగాస్టార్ చిరు


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. సీఎం జగన్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు. చిరకాలం మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను అంటూ మోదీ ట్విట్టర్‌ వేదికగా శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు, వైఎస్సార్‌ సీపీ నేతలు ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

ఇక మెగాస్టార్ మెగాస్టార్‌ చిరంజీవి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్‌ వేదికగా తన విషెస్‌ను తెలియజేశారు. ‘డైనమిక్ యంగ్‌ లీడర్‌ వైఎస్‌ జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. లక్ష్యాలను చేధించడంలో మీ సంకల్పం, మీ పట్టుదల నిజంగా ప్రశంసనీయం. ఎంతో సంతోషంగా, అద్భుతంగా ఇంకో ఏడాది గడపాలి. మరెన్నో సంవత్సరాలు ప్రజలకు మీరు సేవలు చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అని పేర్కొన్నారు.

Tags :
|

Advertisement