Advertisement

  • కర్నూలు స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ విజయవంతం..

కర్నూలు స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ విజయవంతం..

By: Sankar Sat, 25 July 2020 7:44 PM

కర్నూలు స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ విజయవంతం..



కర్నూలు స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో ప్లాస్మా థెరపీ విజయవంతమైంది. ప్లాస్మా స్వీకరించిన కరోనా బాధితుడు సతీష్ గౌడ్ ఆరోగ్యం మెరుగుపడటంతో శనివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వీరపాండియన్ మాట్లాడుతూ.. స్టేట్ కోవిడ్ ఆస్పత్రిలో కరోనా రోగులకు మెరుగైన సేవలు అందిస్తున్నామన్నారు.

ఇప్పటి వరకు ఐదుగురికి ప్లాస్మా థెరపీని అందించామని చెప్పారు. వారిలో నలుగురు రీకవరీ అయ్యారని వెల్లడించారు. కరోనా నుంచి కోలుకున్న వారు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్లాస్మా ఇవ్వాలని కోరారు. ప్లాస్మా దానం చేస్తే ఎలాంటి నష్టం ఉండదని స్పష్టం చేశారు. ప్లాస్మా ఇస్తే అనారోగ్యానికి గురి అవుతామనేది కేవలం అపోహ మాత్రమేనని కలెక్టర్ వెల్లడించారు.

ఇక, ఏపీలో కరోనా వైరస్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రతి రోజూ రికార్డులు బద్దలయ్యేలా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా టెస్టులు భారీగా నిర్వహిస్తుండగా.. కేసులు కూడా అంతే స్థాయిలో నమోదవుతున్నాయి. శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో మరోసారి రికార్డు బ్రేక్ చేసే స్థాయిలో కేసులు నమోదయ్యాయి.

Tags :
|
|

Advertisement