Advertisement

  • ఢిల్లీలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బైలరీ సైన్సెస్‌లో స్థాపించిన 'ప్లాస్మా బ్యాంక్'

ఢిల్లీలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బైలరీ సైన్సెస్‌లో స్థాపించిన 'ప్లాస్మా బ్యాంక్'

By: chandrasekar Tue, 07 July 2020 11:58 AM

ఢిల్లీలో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బైలరీ సైన్సెస్‌లో స్థాపించిన 'ప్లాస్మా బ్యాంక్'


ఇటీవల కరోనా నుంచి కోలుకున్న రోగులు ప్లాస్మాను దానం చేసేందుకు అర్హులు. ఢిల్లీ ప్రభుత్వ సహకారంతో దేశ రాజధానిలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ లివర్‌ అండ్‌ బైలరీ సైన్సెస్‌లో స్థాపించిన భారతదేశపు మొట్టమొదటి 'ప్లాస్మా బ్యాంక్' పని ప్రారంభించింది. ఢిల్లీలోని అన్ని దవాఖానలకు ప్లాస్మాను అందజేయడం ఈ కేంద్రం ప్రధాన ఉద్దేశ్యం. ‘ప్లాస్మా అందిస్తారా? అని నాకు ఇంతకుముందు చాలా ఫోన్‌కాల్స్‌ వచ్చేవి, అప్పుడు ఇక్కడ వసతులు లేవు. కానీ ఇప్పుడు బ్యాంక్‌ పని ప్రారంభించడంతో ఇది సాధ్యపడనుంది.’ అని ఢిల్లీ ప్లాస్మా బ్యాంక్‌ ఇన్‌చార్జి డాక్టర్‌ అనిత పేర్కొన్నారు.

‘ప్లాస్మా దానం చేయాలనుకునేవారికి కరోనా వచ్చినట్లు రిపోర్ట్‌ ఉండాలి. అలాగే, వారు కోలుకొని 14 రోజులు అయి ఉండాలి’ అని ఆమె వివరించారు. దాతకు మొదట ఈ విధానంపై కౌన్సెలింగ్‌ ఇస్తామని చెప్పారు. వారి సిరలను పరిశీలిస్తామని, బీపీ, శరీర ఉష్ణోగ్రత కూడా చెక్‌ చేస్తామని పేర్కొన్నారు. దాత ఫిట్‌గా ఉన్నట్లు తేలితేనే ప్లాస్మాను స్వీకరిస్తామని వెల్లడించారు. అనంతరం రోగికి విశ్రాంతి ఇచ్చి, తర్వాత ప్లాస్మా స్వీకరణ ప్రక్రియ ప్రారంభిస్తామని డాక్టర్‌ అనిత తెలిపారు.

సహజంగా అయితే దీనికి రెండు గంటల సమయం పడుతుందని, కానీ యంత్ర సహాయంతో అరగంటలో ప్రక్రియ పూర్తవుతుందని వివరించారు. దాత ఫిట్‌గా ఉన్నట్లు తేలితేనే ప్లాస్మాను స్వీకరిస్తామని వెల్లడించారు. ఒక దాత నుంచి 500 మిల్లీ లీటర్ల ప్లాస్మాను సేకరిస్తామని, ఇది ఇద్దరు రోగులకు ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అలాగే, దీన్ని ఏడాది వరకు నిల్వ చేయవచ్చని చెప్పారు. కాగా, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ ప్లాస్మాబ్యాంక్‌ను గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. దాతలు ముందుకొచ్చి, ప్లాస్మా దానం చేయాలని కోరారు.

Tags :

Advertisement