Advertisement

యాప్‌ల ద్వారా మొక్కల సంరక్షణ వివరాలు

By: chandrasekar Tue, 14 July 2020 12:39 PM

యాప్‌ల ద్వారా మొక్కల సంరక్షణ వివరాలు


ప్రజలకు మొక్కల పెంపకంపై ఆసక్తి ఉన్నా ఎలా సంరక్షించాలనే విషయాలపై అవగాహన అంతగా ఉండడం లేదు. ఇంటి ఆవరణలో పూలు, పండ్లు, కూరగాయల మొక్కలు పెంచడం ఒక కళ. ఇప్పుడు మొక్కల పెంపకం, విత్తనం ఎంపిక, మొక్కల సంరక్షణ గురించి తెలిపే పలు రకరకాల యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఎప్పుడు ఎలాంటి మొక్కలు నాటాలి? మట్టి, కృత్రిమ ఎరువులు తదితర వివరాలు యాప్‌ల్లో ఉన్నాయి. కొన్ని యాప్‌లు స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తే మరికొన్ని శాస్త్రవేత్తలు, పర్యావరణ ప్రియులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం హరితహారంలో భాగంగా ఇళ్లల్లో మొక్కలు నాటుతుండడంతో యాప్‌ల గురించి తెలుసుకుందాం.

కాలుష్యాన్ని అరికట్టి స్వచ్ఛమైన గాలిని అందించే మొక్కల పెంపకం గురించి తెలియజేయడమే ఈ యాప్‌ ప్రత్యేకత. కుండీల్లో పెంచుకునే మొ క్కల వివరాల గురించి తెలుసుకోవచ్చు. ఇంట్లోని కీటకాలు, బొద్దింకలు, దోమలను పారదోలేందుకు ఎలాంటి మొక్కలు నాటాలనేది వివరిస్తుంది. చిన్న పాటి నీడనిచ్చే మొక్కల పెంపకం గురించి కూడా వివరాలు గార్డెనింగ్‌ టిప్స్‌ యాప్ లో ఉన్నాయి.

పువ్వు పేరు టైప్‌ చేస్తే చాలు దానికి సంబంధించిన యాప్‌లు కన్పిస్తాయి. పువ్వులు మనిషిలో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. పూల మొక్కల పెంపకం వ్యాపారరీత్యా కూడా లాభసాటిగా ఉంటుంది. ఎలాంటి మట్టిలో పెంచాలి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి యాప్‌లో తెలుసుకోవచ్చు. వీటితో పాటు ఔషధ మొక్కలను పెంచుకునే యాప్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

plant,care,details,through,apps ,యాప్‌ల,  ద్వారా, మొక్కల,  సంరక్షణ, వివరాలు


ఇంటి ఆవరణలో అందాన్నిచే మొక్కలు, పెరట్లో సాగు చేసే మొక్కల గురించి హోమ్‌ గార్డెనింగ్‌ యాప్‌లో తెలుస్తుంది. ఎలాంటి విత్తనాలు ఎంచుకోవాలి? నకిలీ విత్తనాలను ఎలా గుర్తించాలి, ఎంత విస్తీర్ణంలో నాటాలి? తదితర వివరాలు ఇందులో ఉంటాయి. కూరగాయలను ఎప్పుడు కోయాలి? నిల్వ ఉంచే విధానంపై వీడియోల రూపంలో వివరిస్తారు. తేమ, నీరు, ఏ ఖనిజ లవణాల అవసరాన్ని తెలియజేస్తుంది.

మొక్కల సంరక్షణకు సంబంధించి ఏ యాప్‌ రూపొందించినా అది నిపుణుల పర్యవేక్షణలో ఉంటుంది. ఈ యాప్‌ లల్లో సమాచారం ప్రకారం ఇంటి ఆవరణంలో గాని పరిసరాల్లో ఖాళీ స్థలం ఉంటే మొక్కలు నాటి సంరక్షించాలి. హరితహారంలో భాగంగా మొక్కలు నాటి వదిలేయకుండా సంరక్షించే బాధ్యత తీసుకోవాలి. ఎలా సంరక్షించాలో తెలుసుకోవడానికి పలు యాప్‌లు ఉన్నాయి.

Tags :
|
|

Advertisement