Advertisement

  • ఉద్యోగాల విషయంలో కెసిఆర్ చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన అవసరంలేదు ...బోయినపల్లి వినోద్ కుమార్

ఉద్యోగాల విషయంలో కెసిఆర్ చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన అవసరంలేదు ...బోయినపల్లి వినోద్ కుమార్

By: Sankar Wed, 16 Dec 2020 5:56 PM

ఉద్యోగాల విషయంలో కెసిఆర్ చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన అవసరంలేదు ...బోయినపల్లి వినోద్ కుమార్


తెలంగాణ రాష్ట్రంలో యాబై వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన విషయం తెలిసిందే ..అయితే దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేసాయి ..దుబ్బాక , జిహెచ్ఎంసి ఫలితాలతో కెసిఆర్ కు నిరుద్యోగులు గుర్తొచ్చారణని ఇన్ని రోజులను నిరుద్యోగులను పట్టించుకోలేదని , ఎంఎల్సి ఎన్నికలకోసమే కెసిఆర్ ఈ నోటిఫికెషన్స్ అని తీసుకొచ్చాడు అని మండిపడ్డాయి..

అయితే రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో చేస్తున్న కృషిని ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఇది ప్రగతిశీల ప్రభుత్వం అని, అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అగ్రభాగాన నిలుస్తుందని తెలిపారు.

ఉద్యోగాల భర్తీ అంశంపై ప్రొ. కోదండరాంకు అపోహలు ఉండటం బాధాకరమన్నారు. ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ఎలా ఉంటుందో ఒక ప్రొఫెసర్‌గా విషయం తెలిసి కూడా ఆయన ప్రభుత్వంపై ఉద్దేశ్య పూర్వకంగా విమర్శలు చేయడం ఏమాత్రం శ్రేయస్కరం కాదన్నారు.

Tags :

Advertisement