Advertisement

  • భజ్జీ 150 వికెట్ల రికార్డును బ్రేక్‌ ‌ చేసిన పియూశ్ చావ్లా

భజ్జీ 150 వికెట్ల రికార్డును బ్రేక్‌ ‌ చేసిన పియూశ్ చావ్లా

By: chandrasekar Mon, 21 Sept 2020 12:50 PM

భజ్జీ 150 వికెట్ల రికార్డును బ్రేక్‌ ‌ చేసిన పియూశ్ చావ్లా


UAE‌: చెన్నై సూపర్‌ కింగ్స్ స్పిన్నర్‌ పియూశ్‌ చావ్లా అరుదైన ఘనత సాధించాడు. ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో చావ్లా మూడో స్థానం దక్కించుకున్నాడు. ఈ క్రమంలో వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్ రికార్డ్ బ్రేక్‌ చేశాడు పియూశ్.‌ భజ్జీ రికార్డు బ్రేక్‌ చేసిన చావ్లా శనివారం జరిగిన లీగ్‌ ఆరంభ పోరులో ముంబై ఇండియన్స్‌ కెప్టెన్ రోహిత్‌ శర్మను ఐదో ఓవర్లో ఔట్‌ చేయడం ద్వారా 31 ఏండ్ల చావ్లా భజ్జీ 150 వికెట్ల రికార్డును బ్రేక్‌ చేశాడు.

ముంబై ఇండియన్స్‌ బౌలర్‌ లసిత్ మలింగ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. మొత్తం 122 ఇన్నింగ్స్‌ల్లో మలింగ 170 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది సీజన్‌ నుంచి మలింగ తప్పుకోవడంతో అతడి స్థానంలో ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జేమ్స్ ప్యాటిన్సన్‌ను ముంబై జట్టులోకి తీసుకున్నది. వ్యక్తిగత కారణాలతో భజ్జీ సీజన్‌ నుంచి తప్పుకున్నాడు.

అధిక వికెట్లు తీసిన బౌలర్లు వరుసగా...

* లసిత్‌ మలింగ-170
* అమిత్‌ మిశ్రా-157
* పియూశ్‌ చావ్లా-151
* హర్భజన్‌ సింగ్‌-150
* డ్వేన్‌ బ్రావో-147

Tags :
|
|
|

Advertisement