Advertisement

  • సోలార్ ఆర్బిటర్ తీసిన చిత్రాలు...సూర్యుడికి అతి దగ్గర నుంచి తీసిన అద్భుత చిత్రాలు

సోలార్ ఆర్బిటర్ తీసిన చిత్రాలు...సూర్యుడికి అతి దగ్గర నుంచి తీసిన అద్భుత చిత్రాలు

By: chandrasekar Sat, 18 July 2020 3:37 PM

సోలార్ ఆర్బిటర్ తీసిన చిత్రాలు...సూర్యుడికి అతి దగ్గర నుంచి తీసిన అద్భుత చిత్రాలు


భూమి నుంచి భూమికి 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న సూర్యుడి గురించి తెలుసుకునేందుకు ఎన్నో దేశాలు పరిశోధనలు చేస్తున్నాయి. విశ్వం పుట్టుక సహా ఎన్నో అంశాలపై పరిశోధన చేసేందుకు వ్యోమనౌకలను పంపాయి. సూర్యుడు ఈ విశ్వంలో అంతు చిక్కని రహస్యం.

యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, నాసా సంయుక్తంగా సోలార్ ఆర్బిటర్‌ను పంపించాయి. ఈ ఏడాది ఫ్రిబ్రవరి 9న సోలార్ ఆర్బిటర్‌ను అంతరిక్షంలోకి పంపించాగా నాలుగు నెలల తర్వాత అది సూర్యుడికి అతి సమీపంలోకి వెళ్లింది. ఆ సమయంలో సోలార్ ఆర్బిటర్ తీసిన చిత్రాలు బయటకొచ్చాయి. వాటిని ట్విటర్‌లో పోస్ట్ చేసింది నాసా.

సూర్యుడికి అతి దగ్గర నుంచి తీసిన ఈ చిత్రాలను మునుపెన్నడూ చూడలేదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. సూర్యుడికి అతి దగ్గర నుంచి తీసిన అద్భుత చిత్రాలను ఇంతకు ముందెప్పుడూ మనం పొందలేదని నాసా శాస్త్రవేత్త హోలీ గిల్‌బర్ట్ తెలిపారు.

సూర్యుడి వాతావరణ పొరలకు సంబంధించి శాస్త్రవేత్తలు చేస్తున్న అధ్యయనానికి ఇవి ఎంతగానో దోహదపడతాయని ఆయన అన్నారు. తక్కువ సమయంలో ఇంతటి అద్భుత ఫలితాలు వస్తాయని మేం ఊహించలేదని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ డేనియల్ ముల్లర్ పేర్కొన్నారు.
సోలార్ ఆర్బిటార్ చాలా చక్కగా పనిచేస్తోందని ఆర్బిటార్‌ను పంపిన కొన్ని రోజుల్లోనే ఈ ఫీట్ సాధించడం చిన్న విషయం కాదని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో సూర్యుడికి సంబంధించిన ఎన్నో విషయాలను సోలార్ ఆర్బిటర్ భూమికి చేరవస్తుందని శాస్త్రవేత్తలు ప్రకటించారు.

Tags :

Advertisement