Advertisement

  • మైసూర్ లో రెండో దశలో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్

మైసూర్ లో రెండో దశలో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్

By: Sankar Sun, 30 Aug 2020 11:56 AM

మైసూర్ లో రెండో దశలో కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్


కరోనా మహమ్మారి తీవ్ర దశలో ఉన్నప్పటికీ దానికి విరుగుడుగా వ్యాక్సిన్ ప్రయోగాలు కూడా అంతే వేగంగా జరుగుతున్నాయి..ఇప్పటికే రష్యా వ్యాక్సిన్ ను ప్రకటించగా , చైనా , అమెరికా కూడా వ్యాక్సిన్ ప్రయోగాలు చేస్తున్నాయ్..అయితే ఇండియాలో కూడా కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు క్లినికల్ ట్రైల్స్ దశకు చేరుకున్నాయి..అయితే ఆక్స్ ఫర్డ్-ఆస్ట్రాజెనెకా-సీరం ఇనిస్టిట్యూట్‌ కొవిషీల్డ్ ట్రయల్స్‌లో భాగంగా మైసూరులోని జేఎస్‌ఎస్‌ ఆస్పత్రిలో వలంటీర్లకు వ్యాక్సిన్‌ ఇచ్చారు.

రెండో దశలో ఆరోగ్యవంతులైన ఐదుగురు వ్యక్తులకు టీకా ఇచ్చారు. దీంతో భద్రత, రియాక్షన్స్‌, అలర్జీలు.. అలాగే ప్రయోజనకరమైన ప్రభావాలను నమోదు చేయనున్నారు. దేశవ్యాప్త నిర్వహిస్తున్న కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో ఎంపిక చేసిన 17 సైట్లలో మైసూర్‌లోని జేఎస్‌ఎస్‌ హాస్పిటల్‌ ఒకటి. ఐసీఎంఆర్‌ హాస్పిటల్‌ను ఎంపిక చేసింది. ఐసీఎంఆర్‌ దేశవ్యాప్తంగా వంద నమూనాలు సేకరించి, మార్పులను పరిశీలిస్తుంది. వ్యాక్సిన్‌ తీసుకున్న ఐదుగురు వలంటీర్లు సెప్టెంబర్‌ 29 వరకు వైద్యుల పరిశీలనలో ఉంటారు. తర్వాత మరింత మందికి వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారు.

వ్యాక్సిన్‌కు భారీగా స్పందన ఉందని జేఎస్‌ఎస్‌ హాస్పిటల్‌ వైద్యులు పేర్కొన్నారు. 250 మంది ఆరోగ్యవంతులైన వలంటీర్లు ట్రయల్స్ కోసం క్యూలో ఉన్నారని తెలిపారు. ఏడాది చివరి నాటికి కొవిడ్‌-19కి ఏదో ఒక రకమైన చికిత్స అందుబాటులో ఉండాలని జేఎస్‌ఎస్‌ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ప్రొఫెసర్‌ ఛాన్సలర్ డాక్టర్ బి.సురేష్ అన్నారు. వ్యాక్సిన్‌, మార్కెటింగ్‌ కోసం అథరైజేషన్‌తో సహా పరిశోధన, మూడో దశ వెంటనే ప్రారంభం అవుతుంది. నాలుగో దశలో, వ్యాక్సిన్ గ్రహీతలు ఏవైనా ప్రతికూల ప్రభావాలను అధ్యయనం చేయడం కోసం ట్రాక్‌ చేయబడడంతో పాటు మానిటరింగ్‌ చేయబడుతారని పేర్కొన్నారు. ఈ సమయంలో ఏడాది, రెండేళ్ల తర్వాత కూడా దుష్ప్రభావాలు తలెత్తవచ్చని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నారు.

Tags :
|
|

Advertisement