Advertisement

  • కరోనా కోసం ఫైజర్‌ టీకా 95 శాతం సమర్థవంతంగా పనిచేస్తోందని వెల్లడి

కరోనా కోసం ఫైజర్‌ టీకా 95 శాతం సమర్థవంతంగా పనిచేస్తోందని వెల్లడి

By: chandrasekar Thu, 19 Nov 2020 10:28 AM

కరోనా కోసం ఫైజర్‌ టీకా 95 శాతం సమర్థవంతంగా పనిచేస్తోందని వెల్లడి


ప్రపంచవ్యాప్తంగా కరోనా వాక్సిన్ కోసం ఫార్మా కంపెనీలు పోటీపడుతున్న ఈ సమయంలో కరోనా కోసం ఫైజర్‌ టీకా 95 శాతం సమర్థవంతంగా పనిచేస్తోందని వెల్లడించింది. కరోనా టీకా కోసం ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్‌ శుభవార్త చెప్పింది. తాము అభివృద్ధి చేసిన టీకా 95 శాతం సమర్థంగా పనిచేస్తోందని వెల్లడించింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను తెలిపింది. తమ కంపెనీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ కరోనా వైరస్ సోకకుండా నిరోధించడంలో 95 శాతం విజయవంతమైందని ప్రకటించింది. తమ టీకా ఎంతో సురక్షితమైనదని పునరుద్ఘాటించింది. మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌లో అన్ని వయస్సుల వారిలో దీని ప్రభావం స్థిరంగానే ఉందని ఫైజర్ తెలిపింది. టీకా తీసుకున్న వారిలో ఆరోగ్య సమస్యలు, దుష్ప్రభావాలు ఏవీ లేవని వెల్లడించింది. కొవిడ్-19 ముప్పు ఎక్కువగా ఉండే 65 ఏళ్ల పైబడినవారిలోనూ వ్యాక్సిన్ సమర్థత 94 శాతానికి పైగా ఉన్నట్టు చెప్పడం మరో విశేషం.

ఫైజర్‌ వ్యాక్సిన్‌‌ను కరోనా పాజిటివ్‌ వ్యక్తులైన 170 మందికి ఇవ్వగా తొలి డోస్ ఇచ్చిన 28 రోజుల తర్వాత మంచి ఫలితాలు కనిపించినట్లు ఫైజర్ తెలిపింది. జర్మన్‌కు చెందిన బయాన్‌టెక్‌ ఎస్‌ఈతో కలిసి ఫైజర్ కరోనా వ్యాక్సిన్‌ను రూపొందిస్తోంది. త్వరలో అత్యవసర వినియోగ అనుమతి కోసం ఎఫ్‌డీఏ కు దరఖాస్తు చేయనున్నట్టు తెలిపింది. కరోనా తీవ్రతతో అల్లాడుతున్న అమెరికాకు ఇది పెద్ద ఊరట కలిగించే అంశం. కానీ ఫైజర్ టీకాను భారత్‌లో అందుబాటులోకి తీసుకొచ్చే అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది. ఇందుకు సంబంధించి ఫైజర్ ఇప్పటి వరకు భారత్‌కు చెందిన ఏ సంస్థతోనూ ఒప్పందం కుదుర్చుకోలేదు. కనీసం ప్రకటన కూడా చేయలేదు. మరోవైపు ఫైజర్ వ్యాక్సిన్‌ను నిల్వ చేయడానికి మైనస్‌ 70 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండాలనే వార్త సవాల్‌గా మారింది. దీంతో చాలా దేశాలు ఆ వ్యాక్సిన్‌‌ను కొనుగోలు చేయాలా? వద్దా అని ఆలోచిస్తున్నాయి. భారత్‌తో పాటు చాలా దేశాల్లో ఆ ఉష్ణోగ్రత వద్ద టీకాను నిల్వ చేసే వసతులు కనిపించడం లేదు. ఇది ఈ వాక్సిన్ కు పెద్ద సవాలుగా మారనుంది.

Tags :

Advertisement