Advertisement

తగ్గిన పెట్రోలు ధరలు

By: Dimple Sat, 12 Sept 2020 09:15 AM

తగ్గిన పెట్రోలు ధరలు

వాహనదారులకు శుభవార్త. దేశీ ఇంధన ధరలు దిగొచ్చాయి. ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయి. పెట్రోల్ ధర 13 పైసలు, డీజిల్ ధర 13 పైసలు చొప్పున క్షీణించాయి. దీంతో హైదరాబాద్‌‌లో శనివారం లీటరు పెట్రోల్ ధర రూ.85.08కు, డీజిల్ ధర రూ.79.49కు తగ్గాయి.

అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరల పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్‌ ధర 13 పైసలు తగ్గుదలతో రూ.86.65కు క్షీణించింది. డీజిల్‌ ధర 13 పైసలు క్షీణతతో రూ.80.66కు తగ్గింది. ఇక విజయవాడలోనూ ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 13 పైసలు తగ్గుదలతో రూ.86.21కు క్షీణించింది. డీజిల్ ధర 13 పైసలు క్షీణతతో రూ.80.25కు తగ్గింది.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా పెట్రోల్ ధర 13 పైసలు తగ్గుదలతో రూ.81.86కు క్షీణించింది. డీజిల్ ధర 12 పైసలు క్షీణతతో రూ.72.93కు దిగొచ్చింది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. పెట్రోల్ ధర 13 పైసలు తగ్గుదలతో రూ.88.51కు క్షీణించింది. డీజిల్ ధర 12 పైసలు క్షీణతతో రూ.79.45కు తగ్గింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు (క్రూడాయిల్) ధరలు మిశ్రమంగా కదిలాయి. బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌‌కు 0.65 శాతం తగ్గుదలతో 39.80 డాలర్లకు క్షీణించింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడాయిల్ ధర బ్యారెల్‌కు 0.21 శాతం పెరుగుదలతో 37.38 డాలర్లకు చేరింది.

ఇకపోతే సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వస్తుంటాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరల ప్రాతిపదికన ఇంధన రిటైల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తూ వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ధరలు ఒక రోజు పెరగొచ్చు. మరో రోజు తగ్గొచ్చు. లేదంటే స్థిరంగా కూడా కొనసాగవచ్చు.

Tags :
|
|

Advertisement