Advertisement

మండుతున్న పెట్రో , డీజిల్ ధరలు

By: Sankar Mon, 22 June 2020 11:23 AM

మండుతున్న పెట్రో , డీజిల్ ధరలు



కరోనా కారణంగా దేశం మొత్తం దాదాపు రెండు నెలల పాటు సంపూర్ణ లాక్ డౌన్ విధించారు ..ఆ టైంలో ఎవ్వరు కూడా బయటకు రాలేదు , అన్ని రకాల కార్యకలాపాలు మూతపడ్డాయి దీనితో ప్రభుత్వాలకు అనేక వేల కోట్ల నష్టం వచ్చింది ..దీనితో ఆ నష్టాన్ని పూడ్చుకోవాలి అనే విధంగా లాక్ డౌన్ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా అన్ని రకాల వస్తువులపైనా రేట్లు అమాంతం పెరుగుతున్నాయి ..అసలె పనులు లేక , పని చేసిన జీతాలు సరిగా రాక అల్లాడుతున్న సామాన్య ప్రజలు ఈ పెరిగిన రేట్లతో లబోదిబోమంటున్నారు ..

ఇక లాక్ డౌన్ ను దశల వారీగా ఎత్తి వేయడంతో ప్రజలు ఇప్పుడిప్పుడే మల్లి తమ కార్యకలాపాలు మొదలు పెడుతున్నారు ..అయితే ప్రభుత్వ ట్రాన్స్పోర్ట్ అయిన బస్సులు ఇంకా సరిగా తిరగకపోవడంతో తమ సొంత వాహనాలమీదనే వెళ్తున్న ప్రజలకు పెరుగుతున్న ఇంధన ధరలు పెద్ద భారంగా మారుతున్నాయి ..రేట్లు పెరుగుతున్నప్పటికీ వేరే దారి లేక ప్రజలు అలాగే ఇబ్బందులు పడుతూనే తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు ..

దేశవ్యాప్తంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు వరుసగా 16వ రోజు పెరిగాయి. సోమవారం పెట్రోల్‌పై 33 పైసలు, డీజిల్‌పై 55 పైసలను చమురు సంస్థలు పెంచాయి. దీంతో గత 16 రోజుల్లో పెట్రోల్‌పై రూ.8.36 పైసలు, డీజిల్‌పై రూ.8.82 పైసలు ధరలు పెరిగాయి. రెండు వారాలుగా పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలు వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. పెంచిన ధరల ప్రకారం దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో పరిశీలిస్తే..పెట్రోల్ ధర అత్యధికంగా ముంబైలో 86.04 రూపాయలు ఉండగా , చెన్నై , హైదరాబాద్ లలో 82 రూపాయల పైన ఉంది , ఇక అత్యల్పంగా ఢిల్లీలో 79.23 రూపాయలు ఉంది ..

Tags :
|
|
|
|

Advertisement