Advertisement

  • నూతన సంవత్సరంలో పెరగనున్నపెట్రోల్, డీజిల్ ధరలు...

నూతన సంవత్సరంలో పెరగనున్నపెట్రోల్, డీజిల్ ధరలు...

By: chandrasekar Sat, 12 Dec 2020 8:04 PM

నూతన సంవత్సరంలో పెరగనున్నపెట్రోల్, డీజిల్ ధరలు...


ప్రపంచ దేశాలు లాక్‌డౌన్ విధించడం వల్ల పెట్రో ఉత్పత్తులకు డిమాండ్ తగ్గింది. బ్యారెల్ చమురు ధరలు మైనస్‌లోకి చేరాయి. లాక్‌డౌన్ సడలించాక చమురు ఉత్పత్తులకు డిమాండ్ పెరిగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్ ధర రెండేళ్ల గరిష్టానికి చేరింది. కొన్ని దేశాలు కరోనా వ్యాక్సిన్‌కు అనుమతులు ఇచ్చారు. వ్యాక్సిన్ త్వరితగతిన అందుబాటులోకి వస్తుండటంతో క్రూడ్ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉంది. మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే పెరిగాయి.

మన దేశంలో ప్రస్తుతం పెట్రోలియం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. డీజిల్, జెట్ ఫ్యూయల్‌కు సైతం డిమాండ్ గణనీయంగా పెరిగింది. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతుండటంతో ఆయిల్ కంపెనీలు దేశీయంగానూ చమురు ధరలను పెంచుతున్నాయి. శనివారం హైదరాబాద్‌‌లో పెట్రోల్ ధర రూ.87.06 ఉండగా డీజిల్ ధర రూ.80.60గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర ఇప్పటికే రూ.90 దాటింది. నవంబర్ 20 నుంచి దాదాపు ప్రతి రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు గత నాలుగైదు రోజులుగా నిలకడగా ఉన్నాయి. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రభుత్వ రంగ చమురు సంస్థలు ప్రతి రోజూ పెట్రోల్, డీజిల్ ధరలను సవరిస్తున్నాయి.

Tags :
|
|
|
|

Advertisement