Advertisement

  • అన్‌లాక్ 5.0 లో 50 శాతం సామర్థ్యంతో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరిచేందుకు అనుమతి

అన్‌లాక్ 5.0 లో 50 శాతం సామర్థ్యంతో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరిచేందుకు అనుమతి

By: chandrasekar Tue, 06 Oct 2020 09:06 AM

అన్‌లాక్ 5.0 లో 50 శాతం సామర్థ్యంతో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరిచేందుకు అనుమతి


కరోనా వల్ల దేశంలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. కానీ ప్రస్తుతం కేంద్ర అన్ లాక్ కు నిబంధనలు సరళతరం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర హోం శాఖ జారీ చేసిన కోవిడ్- 19 అన్‌లాక్ 5.0 నిబంధనల్ని నోటిఫై చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. కంటైన్మెంట్ జోన్లు మినహా మిగిలిన ప్రాంతాల్లో అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతిచ్చింది. అక్టోబర్ 15వ తేదీ తర్వాత పాఠశాలలు తెరిచేందుకు రాష్ట్రాలకే కేంద్రం అధికారం ఇచ్చిన విషయం విదితమే. అయితే స్కూళ్ల ప్రారంభంపై జగన్ సర్కార్ ట్విస్ట్ ఇచ్చింది. పాఠశాలలకు పిల్లల్ని పంపాలంటే విద్యార్థుల తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేస్తూ నిబంధనలు జారీ చేసింది. అలాగే ఆన్‌లైన్, దూరవిద్య తరగతులకు ప్రాధాన్యం ఇవ్వాలని విద్యాసంస్థలకు జగన్ సర్కారు సూచించింది. ఇక, 50 శాతం సామర్థ్యంతో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు తెరిచేందుకు అనుమతి ఇచ్చింది.

అన్‌లాక్ 5.0 లో సామాజిక, విద్య, క్రీడా, వినోద, సాంస్కృతిక, మతపరమైన సమావేశాలు, రాజకీయ పరమైన సమావేశాలకు 100 మందికి మాత్రమే అనుమతిచ్చింది. అలాగే అక్టోబర్ 31 వరకూ లాక్‌డౌన్ నిబంధనలు కంటైన్మెంట్ జోన్లకే పరిమితం స్పష్టం చేశారు. అయితే 65 ఏళ్ల వయసు పైబడిన వ్యక్తులు, 10 ఏళ్ల లోపు చిన్నారులు అత్యవసరం అయితే మినహా బయట తిరగకుండా చూడాలని ప్రభుత్వం ఆదేశాలు చేసింది. ప్రభుత్వం బహిరంగ ప్రదేశాలు, పని చేస్తున్న కార్యాలయాలు, ప్రజా రవాణా సాధనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు మాస్కులు తప్పనిసరి అని తేల్చిచెప్పింది.

కరోనా కట్టడి చేయడానికి వాణిజ్య సముదాయాలు, దుకాణాల వద్ద కచ్చితంగా భౌతిక దూరం పాటించేలా చూడాలని సూచించింది. బహిరంగంగంగా ఉమ్మి వేయటం పైనా జగన్ సర్కార్ నిషేధం విధించింది. ఎవరైనా అలా చేస్తే జరిమానా విధించాలని స్థానిక అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత మేర వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని ప్రోత్సహించాలని ప్రభుత్వం సూచనలు జారీ చేసింది. ఎవరైనా నిబంధనల ఉల్లంఘనకు పాల్పడితే పాండమిక్ డిసీజెస్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఇందువల్ల ప్రజలందరూ జాగ్రత్త వహించాలని సూచిందారు.

Tags :

Advertisement