Advertisement

  • ఫైర్ సేఫ్టీ సక్రమంగా లేని కారణంగా నాలుగు కరోనా సెంటర్ల అనుమతి రద్దు

ఫైర్ సేఫ్టీ సక్రమంగా లేని కారణంగా నాలుగు కరోనా సెంటర్ల అనుమతి రద్దు

By: chandrasekar Fri, 28 Aug 2020 5:10 PM

ఫైర్ సేఫ్టీ సక్రమంగా లేని కారణంగా నాలుగు కరోనా సెంటర్ల అనుమతి రద్దు


మరో నాలుగు కరోనా సెంటర్లకు సంబంధించిన ఫైర్ సేఫ్టీ అనుమతులు సక్రమంగా లేవని ప్రభుత్వం గుర్తించింది. విజయవాడలో నిబంధనలు అతిక్రమించిన కరోనా సెంటర్లకు ప్రభుత్వం అనుమతులను రద్దు చేసింది. ఎలైట్ అడ్వాన్స్ కరోనా సెంటర్, సాయి మాధవి హాస్పిటల్, అనిల్ న్యూరో అండ్ ట్రామ సెంటర్, బి.ఎన్. శ్రీరామ్ హాస్పిటల్‌కు సంబంధించిన కరోనా సెంటర్లకు అనుమతులను రద్దు చేసింది.

ఈ కరోనా సెంటర్లలో అధికారుల విచారణలో అధిక మొత్తంలో పేషేంట్స్ నుంచి నగదు వసూళ్లు, ఫైర్ సేఫ్టీ అనుమతులు సక్రమంగా లేవని తేలింది. దీంతో వీటిపై చర్యలు తీసుకున్నారు. మరోవైపు నిబంధనలు పాటించని ఈ కోవిడ్ సెంటర్లకు అనుమతులు ఎలా వచ్చాయనే దానిపై అధికారులు దృష్టి పెట్టారు. దీంతో వీటికి అనుమతులు రావడం వెనుక అధికారుల అవినీతి ఉందనే విషయం వెలుగులోకి వచ్చింది.

క్షేత్రస్థాయిలో పరిశీలన సక్రమంగా చేయకుండా కృష్ణాజిల్లా డిఎంహెచ్‌వో ఇష్టారాజ్యంగా అనుమతులు ఇస్తున్నట్టు గుర్తించారు. కరోనా సెంటర్స్ అనుమతులు విషయంలో భారీగా చేతివాటం ప్రదర్శించారని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. స్వర్ణప్యాలెస్ ఘటనకు ఇదే ప్రధాన కారణమని అధికారులు భావిస్తున్నారు.

Tags :

Advertisement