Advertisement

  • 17 దేశాలకు విమాన ప్రయాణానికి భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి

17 దేశాలకు విమాన ప్రయాణానికి భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి

By: chandrasekar Sat, 17 Oct 2020 09:52 AM

17 దేశాలకు విమాన ప్రయాణానికి భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతి


కరోనా వల్ల అన్ని దేశాలకు విమాన ప్రయాణాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 17 దేశాలకు విమాన ప్రయాణానికి భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అనుమతినిచ్చింది. భారత పౌర విమానయాన మంత్రిత్వ శాఖ 17 దేశాలకు విమాన ప్రయాణం చేయడానికి ప్రత్యేక ఎయిర్ బబుల్ అగ్రీమెంట్ చేసుకుంది. ఇందులో భాగంగా ఉక్రెయిన్ దేశానికి ప్రయాణించడానికి ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగింది. కరోనావైరస్ మహహ్మారి తరువాత ప్రపంచం మొత్తం మళ్లీ సాధారణ స్థితికి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా అంతర్జాతీయ విమానాలు మెల్లమెల్లగా మొదలవుతున్నాయి. దీని కోసం వివిధ దేశాలు ట్రాన్స్ పోర్ట్ బబుల్ లేదా ఎయిర్ ట్రావెల్ అరేంజ్ మెంట్స్ ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇందులో ఒప్పందం చేసుకునే ఇరు దేశాలు లబ్ది పొందుతాయి.

ఇప్పుడు భారత దేశం నుండి ఉక్రెయిన్ వెళ్లాలి అంటే భారతీయులు లేదా సీఐఎస్ దేశాలకు చెందిన వారు అయి ఉండాలి. ఇందులో రష్యా దేశస్తులకు అనుమతి లేదు. ఉక్రెయిన్ వెళ్లడానికి డిప్లమాటిక్ పాస్ పోర్టు లేదా అధికారిక పాస్ పోర్టు ఉండాలి. సీఐఎస్ దేశాల అధికారిక పాస్ పోర్టు ఉన్నా సరిపోతుంది. భారత దేశం నుంచి ఉక్రెయిన్ కు వెళ్లాలి అనుకునే వారికి బోర్డింగ్ వద్ద ఎలాంటి సమస్య ఉండకుండా ఇరు దేశాల అధికారులు జాగ్రత్తలు తీసుకుంటారు. అలాగే ఉక్రెయిన్ నుంచి భారత దేశానికి రావాలంటే సీఐఎస్ దేశాల జాబితాలో ఉన్న భారతీయులు (రష్యా దేశానికి మినహాయింపు) గా ఉండాలి. అలాగే ఉక్రెయిన్ ప్రభుత్వం జారీ చేసిన ఓవర్సీస్ సిటిజన్స్ కు అనుమతి ఉంటుంది.

Tags :

Advertisement