Advertisement

  • మాల్స్ మినహా మిగిలిన అన్ని షాపులకు హైదరాబాద్‌లో పర్మిషన్

మాల్స్ మినహా మిగిలిన అన్ని షాపులకు హైదరాబాద్‌లో పర్మిషన్

By: chandrasekar Thu, 28 May 2020 3:15 PM

మాల్స్ మినహా మిగిలిన అన్ని షాపులకు హైదరాబాద్‌లో పర్మిషన్


హైదరాబాద్ నగరంలో గురువారం నుంచి మాల్స్ మినహా అన్ని రకాల షాపులు తెరవడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం నగరంలో ఒక షాపు తప్పించి మరో షాపు తెరిచే వెసులుబాటు ఉంది. ఒకరోజు తెరిస్తే మరో రోజు మూస్తున్నారు. దీనివల్ల ఒకే షాపులో ఎక్కువ మంది గుమిగూడే ప్రమాదం ఏర్పడుతున్నందున ఎక్కువ షాపులు తెరిచి, తక్కువ మంది పోగయ్యే విధానం అనుసరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

గురువారం నుంచి అన్ని షాపులు తెరచుకుంటాయని తెలిపింది. షాపుల యజమానులు, వినియోగదారులు కోవిడ్ నిబంధనలు పాటించాలని కస్టమర్లకు శానిటైజర్‌ను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం కోరింది. గడిచిన 24 గంటల్లో తెలంగాణలో 107 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. అందులో తెలంగాణకు సంబంధించి 39 కేసులు కాగా, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో 69 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. వలస కూలీలు 19 మంది, సౌదీ అరేబియా నుంచి వచ్చిన 49 మందికి కరోనా సోకింది.

permission,hyderabad,all shops,except,malls ,మాల్స్, మినహా, మిగిలిన, అన్ని షాపులకు, హైదరాబాద్‌


కరోనా కేసులతో తెలంగాణలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1842గా ఉంది. వలస కూలీలు, ఇతర రాష్ట్రాలు దేశాల నుంచి వచ్చిన వారికి కరోనా సోకిన వారి సంఖ్య 297గా ఉంది. ఇప్పటి వరకు తెలంగాణలో 1321 మంది డిశ్చార్జ్ అయ్యారు. 63 మంది ప్రాణాలు కోల్పోయారు. 714 మంది కరోనా పేషెంట్లు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

Tags :
|

Advertisement