Advertisement

  • ఐపీఎల్‌ లో ప్లేయర్స్ కుటుంబ సభ్యులకు పర్మిషన్

ఐపీఎల్‌ లో ప్లేయర్స్ కుటుంబ సభ్యులకు పర్మిషన్

By: chandrasekar Thu, 06 Aug 2020 11:50 AM

ఐపీఎల్‌ లో ప్లేయర్స్ కుటుంబ సభ్యులకు పర్మిషన్


బీసీసీఐ.. ఐపీఎల్‌ నిర్వహణను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా అంతే సాఫీగా నిర్వహించేందుకు రెడీ అవుతూ ఉంది. ఇందులో భాగంగా కరోనా వైరస్‌ వ్యాప్తి కారణంగా అందరి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని 16 పేజీలతో కూడిన ప్రామాణిక నిర్వహణ పద్ధతి (ఎస్‌వోపీ)ని బీసీసీఐ బుధవారం విడుదల చేసింది.

లీగ్‌లో ఆడేందుకు యూఏఈకి ప్రత్యేక విమానాల్లో వెళ్లడం నుంచి మొదలుపెడితే ఆఖరి బంతి పడే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో బోర్డు ఎస్‌వోపీలో కచ్చితమైన మార్గదర్శకాలను పేర్కొంది. ఫ్రాంచైజీలకు వేర్వేరుగా హోటల్‌ రూమ్స్‌ కేటాయించడంతో పాటు డ్రెస్సింగ్‌ రూమ్‌లో భౌతిక దూరం పాటించడం, ఎలక్ట్రానిక్‌ టీమ్‌ షీట్లను మెయింటేన్‌ చేయాలని పేర్కొంది.

యూఏఈలో దిగిన వెంటనే ఆటగాళ్లు ఒకరినొకరు కలుసుకోవడానికి వీలు లేదని తెలియ చేసింది. కరోనా ఆర్టీపీసీఆర్‌ పరీక్షల్లో మూడు సార్లు నెగిటివ్‌ వచ్చిన తర్వాతే కలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది.

ప్రతి జట్టు మెడికల్‌ అధికారిని నియమించుకోవాల్సి ఉంటుంది. మార్చి 1 నుంచి ఆటగాళ్ల ఆరోగ్య, ప్రయాణ రికార్డును వీరు తమ దగ్గర ఉంచుకోవాలని వివరించింది. ఆటగాళ్ల కుటుంబ సభ్యులకు అనుమతిస్తూనే నిబంధనలు కచ్చితంగా పాటించాలని బోర్డు పేర్కొంది.

Tags :

Advertisement