Advertisement

  • రెండు వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగానికి అనుమతి...

రెండు వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగానికి అనుమతి...

By: chandrasekar Sat, 05 Dec 2020 4:38 PM

రెండు వ్యాక్సిన్లకు అత్యవసర వినియోగానికి అనుమతి...


దేశంలో కరోనా వ్యాక్సిన్లలో మూడో విడత క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్న వ్యాక్సిన్లలో రెండు వచ్చే ఏడాది జనవరి నాటికి దేశంలో అత్యవసర వినియోగానికి అర్హత సాధించే అవకాశం ఉందని ఆల్‌ ఇండియా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సెన్సెస్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా అన్నారు. ఇటీవల యూకే ఫైజర్‌ వ్యాక్సిన్‌ను అత్యవసర వినియోగానికి అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అత్యంత కీలకమైన మాస్ ఇనాక్యులేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి రేసులో మిగతా ప్రపంచాల దేశాలకంటే ముందుంది. మూడో విడత ట్రయల్స్‌ తర్వాత ఫైజర్‌ టీకా భారత్‌లో దాదాపు వెంటనే అందుబాటులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌- ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంటిగ్రేటివ్‌ మెడిసిన్‌ (సీఎస్‌ఐఆర్‌-ఐఐఐఎం)కు చెందిన రామ్‌ విశ్వకర్మ మాట్లాడుతూ.. భారత్‌లో అత్యవసర వినియోగ అధికారం (ఈయూఏ) యూరోపియన్‌, యూకే, అమెరికాలో మాదిరిగానే ఉంటుందన్నారు.

ఫైజర్‌ భారత డ్రగ్స్‌ రెగ్యులరేటర్‌కు దరఖాస్తు చేస్తే.. డ్రగ్‌ కంట్రోలర్‌ డేటాతో సంతృప్తి చెందితే వినియోగానికి వారాల్లోనే ఆమోదించవచ్చన్నారు. కరోనా‌ నిర్వహణ జాతీయ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యుడైన రణదీప్‌ గులేరియా మాట్లాడుతూ సీరం ఇనిస్టిట్యూట్‌ రూపొందిస్తున్న కొవిషీల్డ్‌, భారత్‌ బయోటెక్‌ సంస్థ కొవాగ్జిన్‌ వ్యాక్సిన్లు జనవరి నాటికి దేశంలో అత్యవసర వినియోగానికి అందుబాటులో ఉండే అవకాశం ఉందన్నారు. మొదట వ్యాక్సిన్‌ కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో ముందున్న వారికే అందుతుందని, 2022 దాకా సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండదని ఆయన స్పష్టం చేశారు. వ్యాక్సిన్‌ భారత మార్కెట్లలో సులభంగా లభ్యమయ్యేందుకు ఏడాదికిపైగా సమయం పడుతుందని అన్నారు.

Tags :
|
|

Advertisement