Advertisement

ఈసారి దీపావళికి అంతగా లేని కాలుష్యం...

By: chandrasekar Mon, 16 Nov 2020 11:01 AM

ఈసారి దీపావళికి అంతగా లేని కాలుష్యం...


ప్రతి దీపావళి పండుగకు హైదరాబాద్‌లో మూడురెట్ల చొప్పున కాలుష్యం పెరుగుతు౦ది. కానీ ఈసారి అంతగా పెరుగలేదని కాలుష్య నియంత్రణమండలి అధికారులు అభిప్రాయపడుతున్నారు. కాలుష్య తీవ్రతలను గమనిస్తే ముఖ్యంగా వాయుకాలుష్యం పెరుగుదలలో పెద్దగా మార్పులేమిలేవని అధికారులు అంటున్నారు.

కరోనా పరిస్థితుల దృష్ట్యా చాలా మంది పటాకులు కాల్చేందుకు ప్రజలు ఆసక్తిచూపలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంతో పోల్చితే ఈ ఏడాది పటాకుల అమ్మకాలు సైతం గణనీయంగా తగ్గాయని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వాస్తవికంగా పండుగకు రెండు రోజుల ముందు, పండుగ తర్వాత ఒక రోజు నగరమంతా భారీగా పటాకులను పేల్చడం అలావాటుగా వస్తున్నది. ఈ రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున శబ్దాలు వినిపిస్తాయి. కాని ఈసారి కొనుగోళ్లు అంతగా జరుగలేదని, ఒక్క దీపావళి పండుగ రోజు మాత్రమే కాల్చడానికి జనం ఆసక్తిచూపినట్లుగా వ్యాపారులు అంటున్నారు. కొనుగోళ్లు మందగించడం, పర్యావరణంపై అవగాహన పెరుగడంతో కాలుష్యం తగ్గినట్లుగా తెలుస్తున్నది.

గాలి నాణ్యత స్కోర్‌ 100లోపు ఉంటే సంతృప్తికరంగా, 100కు మించితే మోడరేట్‌గా ఉన్నట్లుగా పరిగణిస్తారు. ఈ లెక్కన హైదరాబాద్‌లోని నాలుగు స్టేషన్లలో సంతృప్తికరంగా ఉంటే, రెండు స్టేషన్లలో మాత్రం మోడరేట్‌గా ఉంది. దీపావళి ముందు సైతం కాలుష్య తీవ్రతలు ఇదే తీరుగా ఉండటం గమనార్హం. దుమ్ముధూళి ఉద్ఘారాల ప్రభావం తప్పా నైట్రోజన్‌, కార్బన్‌మోనాక్సైడ్‌ లాంటి గ్యాసుల ప్రభావం అంతగా కనపించలేదు. అదే ఢిల్లీలో గాలి నాణ్యత స్కోర్‌ 440, లక్నోలో 341, ఆగ్రాలో 327 ఘజియాబాద్‌లో 465, కాన్పూర్‌లో 263, కోల్‌కత్తాలో 225, జైపూర్‌లో 231గా నమోదయ్యింది.

Tags :
|

Advertisement