Advertisement

  • కరోనా సోకిన వ్యక్తులు తుమ్మినా, దగ్గినా వెలువడే తుంపర్ల ద్వారా పెను ముప్పు

కరోనా సోకిన వ్యక్తులు తుమ్మినా, దగ్గినా వెలువడే తుంపర్ల ద్వారా పెను ముప్పు

By: chandrasekar Fri, 07 Aug 2020 07:52 AM

కరోనా సోకిన వ్యక్తులు తుమ్మినా, దగ్గినా వెలువడే తుంపర్ల ద్వారా పెను ముప్పు


కరోనా సోకిన వ్యక్తులు తుమ్మినా, దగ్గినా వెలువడే తుంపర్ల ద్వారా పెను ముప్పు ఏర్పడుతున్నట్లు పరిశోధనల్లో వెలువడ్డాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిపై అనేక పరిశోధనలు కొనసాగుతున్నాయి. కోవిడ్ సోకిన వ్యక్తులు తుమ్మినా, దగ్గినా వెలువడే తుంపర్ల ద్వారా వైరస్ ఇతరులకు సంక్రమిస్తుంది. ముక్కు, నోటి నుంచి వెలువడే తుంపర్లు వైరస్‌ను మోసుకెళ్తుంటాయి. అయితే వివిధ పరిమాణాల్లోని తుంపర్ల కదలికలు ఎలా ఉంటాయన్న విషయాన్ని మరింత లోతుగా తెలుసుకోడానికి చేసిన పరిశోధనలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. దీనిద్వారా కొరోనాని కట్టడి చేయడానికి ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

కరోనా వైరస్ వ్యాప్తిని గుర్తించడానికి బ్రిటన్‌లోని ఈడెన్‌బర్గ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు సరికొత్త విధానాన్ని అభివృద్ధి చేశారు. ముఖ్యంగా గాలి ద్వారా కరోనా వ్యాప్తిని గుర్తించడానికి ఇది ఉపకరిస్తుందని భావిస్తున్నారు. మ్యాథ్‌మెటికల్ మోడల్ ఆధారంగా రూపొందించిన ఈ కొత్త విధానాన్ని ‘ఫిజిక్స్‌ ఆఫ్‌ ఫ్లూయిడ్స్‌’ జర్నల్‌లో ప్రచురించారు. చిన్న, మధ్యతరహా, పెద్ద పరిమాణంలో ఉన్న తుంపర్ల పరిధిని నిర్ణయించడానికి గణిత సూత్రాలను ఉపయోగించడం విశేషం. ముక్కు, నోటి నుంచి వెలువడే తుంపర్ల పరిమాణం, వాటి ప్రయాణం మధ్య ఒకే విధమైన సంబంధం లేదని, మధ్యస్థాయి పరిమాణంలోని తుంపర్ల కంటే చిన్న, పెద్ద తుంపర్లే ఎక్కువగా ప్రయాణిస్తున్నాయని తెలిపారు.

కరోనా సోకినా వ్యక్తినుండి వెలువడే వైరస్లు ఆరోగ్య సిబ్బంది ధరించే పీపీఈ కిట్లు పెద్ద తుంపర్లను సమర్థంగా అడ్డుకోగలుగుతున్నాయి గానీ, చిన్న తుంపర్లను మాత్రం నిలువరించలేకపోతున్నాయని పేర్కొన్నారు. ఈ కారణంగానే చాలామంది వైద్య సిబ్బంది సైతం వైరస్‌ బారిన పడుతున్నారు. తుంపర్ల ప్రవర్తననూ, మేం రూపొందించిన కొత్త విధానాన్ని ఆధారం చేసుకుని ఏరోసోల్‌ ఎక్స్‌ట్రాక్టర్‌ అనే పరికరాన్ని రూపొందించినట్టు వివరించారు. ఇది తలవెంట్రుక కంటే తక్కువ వ్యాసముండే తుంపర్ల నుంచి కూడా సమర్థంగా రక్షణ కల్పిస్తుందని పరిశోధనలో గుర్తించారు.

ఈ పరిశోధనలు భవిష్యత్తులోనూ పలు రకాల ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ కల్పించేందుకు ఇది దోహదపడుతుందని పరిశోధనకర్త ఫెలిసిటీ మెహండాలే అన్నారు. గాలి ద్వారా వ్యాప్తి చెందే కోవిడ్-19 వంటి వ్యాధుల గురించి అర్ధం చేసుకోవడానికి చేపట్టిన పరిశోధనల్లో మధ్యస్థాయి తుంపర్లను పీపీఈ కిట్‌లు అడ్డుకుంటున్నట్టు గుర్తించామన్నారు. శ్వాసను పరిశీలించడానికి విశ్లేషణాత్మకంగా అన్వేషించగలిగే గణిత నమూనాను అభివృద్ధి చేయాలనుకుంటున్నామని సహ-పరిశోధకుడు కాథల్ కొమ్మిన్స్ అన్నారు. మధ్యస్థాయి కంటే చిన్న, పెద్ద తుంపర్లు ఎక్కువ ప్రయాణిస్తున్నప్పుడు, బిందు పరిమాణం, స్థానభ్రంశం మధ్య సరళమైన సంబంధం లేదని అధ్యయనంలో వెల్లడయినట్టు ఫెలిసిటీ మెహెండాలే పేర్కొన్నారు. చికిత్స చేసే వైద్యులు ముఖ్యంగా డెంటిస్ట్‌‌ల భద్రత కోసం ఏరోసోల్ ఎగ్జాక్టర్ పరికరాన్ని తయారుచేసే పనిలో ఉన్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. వైరస్ వ్యాప్తిపై లోతు పరిశోధనల ఫలితాలు కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ఎంతో ఉపయోగపడుతాయన్న పరిశోధకులు.

Tags :
|

Advertisement