Advertisement

  • గోవధ నిరోధక బిల్లుపై కర్ణాటక ప్రజలు సంతోషంగా ఉన్నారు ...కర్ణాటక సీఎం

గోవధ నిరోధక బిల్లుపై కర్ణాటక ప్రజలు సంతోషంగా ఉన్నారు ...కర్ణాటక సీఎం

By: Sankar Fri, 11 Dec 2020 4:23 PM

గోవధ నిరోధక బిల్లుపై కర్ణాటక ప్రజలు సంతోషంగా ఉన్నారు ...కర్ణాటక సీఎం


గోవధ నిరోదక బిల్లు ఆమోదంపై రాష్ట్రంలోని 90శాతం మంది ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని కర్ణాటక సీఎం బీఎస్‌ యెడియూరప్ప అన్నారు.

బుధవారం అసెంబ్లీలో గోవధ నిషేధం, పశు సంరక్షణ బిల్లులు ఆమోదం పొందిన సందర్భంగా శుక్రవారం బెంగళూర్‌లో ఆయన గోపూజ చేసి మాట్లాడారు. భారత సంస్కృతిలో ఆవుకు విలువైన సంపదగా గుర్తింపు ఉందని అన్నారు. గోవుల సంరక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.

ఇదిలాఉండగా గోవధ నిర్మూలన బిల్లు ఆమోదంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీలో చర్చించకుండానే ప్రభుత్వం బిల్లును ఆమోదించిందని కాంగ్రెస్‌, జేడీ(యూ)లు ఆక్షేపిస్తున్నాయి. నూతన చట్టం ప్రకారం ఆరోగ్యవంతమైన గోవును వధించిన వారికి 3 నుంచి ఏడు సంవత్సరాలు జైలుశిక్షతోపాటు 5 నుంచి 10 లక్షల జరిమానా విధించవచ్చు.

Tags :
|
|

Advertisement