Advertisement

  • అట్టహాసంగా ఐఫోన్ 12 లాంచ్..తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వినియోగదారులు ..ఎందుకో తెలుసా !

అట్టహాసంగా ఐఫోన్ 12 లాంచ్..తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వినియోగదారులు ..ఎందుకో తెలుసా !

By: Sankar Wed, 14 Oct 2020 4:04 PM

అట్టహాసంగా ఐఫోన్ 12  లాంచ్..తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వినియోగదారులు ..ఎందుకో తెలుసా !


టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ ప్రేమికులకు భారీ షాకే ఇచ్చింది. అట్టహాసంగా లాంచ్ చేసిన ఐఫోన్ 12కు సంబంధించి యూజర్లకు తీవ్ర నిరాశను మిగిల్చింది.

హైస్పీడ్, అధునాతన టెక్నాలజీ, 5జీ నెట్ వర్క్ అంటూ పరిచయమైన 24 గంటల్లోనే ఐఫోన్ 12 వివాదంలో పడింది. ఇంతకు విషయం ఏమిటంటే ఖరీదైన ఆపిల్ ఐఫోన్12లో చార్జర్, ఇయర్ ఫోన్స్ ను సంస్థ మిస్ చేసింది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వినియోగదారులు సోషల్ మీడియాలో ఆపిల్ సంస్థపై మండిపడుతున్నారు.

ఆపిల్ అధికారిక వెబ్ సైట్ లో ఐఫోన్ 12 బాక్స్ ఐఫోన్ అడాప్టర్, ఇయర్ ఫోన్స్ ఇవ్వడం లేదంటూ ప్రకటించి కొనుగోలుదారుల ఆశలపై నీళ్లు చల్లింది. 2030 నాటికి “నెట్-జీరో క్లైమేట్ ఇంపాక్ట్” తో ప్రపంచాన్ని తీర్చిదిద్దుతామన్నహామీని నెరవేర్చడానికే ఈనిర్ణయం తీసుకున్నామంటూ చావు కబురు చల్లగా చెప్పింది. దీంతో ఎంతోకాలంగా లేటెస్ట్ ఐఫోన్ కోసం ఎదురుచూసిన యూజర్లు ట్విటర్లో విమర్శలు గుప్పిస్తున్నారు. కిడ్నీ అమ్ముకొని మరీ ఖరీదైన ఐఫోన్ కొనుక్కుంటే.. ఇంత అన్యాయమా అంటూ చమత్కరిస్తున్నారు

Tags :
|
|
|

Advertisement