Advertisement

ఎండ తీవ్రతకు అల్లాడుతున్న ప్రజలు

By: Sankar Fri, 29 May 2020 6:58 PM

ఎండ తీవ్రతకు అల్లాడుతున్న ప్రజలు

కరోనా వలన దేశం మొత్తం లాక్ డౌన్ విధించడంతో ఈ సారి వేసవిలో ఎండల ప్రభావానికి ప్రజలు ఎక్కువగా గురి అవ్వలేదు ..కానీ గత కొద్దీ రోజులుగా లాక్ డౌన్ లో సడలింపులు ఇవ్వడంతో ప్రజలు రోడ్ల పైకి వస్తున్నారు ..దీనితోపాటు ఎండలు కూడా పెరగడంతో ప్రజలు ఎండ తీవ్రతకు తట్టుకోలేక అల్లాడుతున్నారు..

ఫ్యాన్లు ఎన్ని తిరుగుతున్నా ఇళ్లల్లో వేడి భరించలేకుండా ఉన్నామని చెప్తున్నారు. ఉక్కపోతకు తోడు.. వేడిగాలుల నుంచి ఉపశమనం కోసం ఏసీ, కూలర్లను వినియోగించాలని ఉన్నా.. కరోనా భయంతో వాటికి దూరంగా ఉంటున్నామని వాపోతున్నారు. ముఖ్యంగా లాక్‌డౌన్‌ సమయంలో నగర వాసులు.. తమ వేడి బాధను సోషల్‌ మీడియాలో మీమ్స్‌ రూపంలో వెళ్లక్కుతున్నారు. ఈ నేపథ్యంలో వాటిల్లో ఒక మీమ్‌ నెటిజన్లకు ఆకట్టుకుంటోంది. ‘నువ్‌ సూర్యుడివా యముడివా.. అలా మండుతున్నావ్‌ ఏంటి.. నిన్న 45 డిగ్రీలు, ఇవాళ 46 డిగ్రీలు చచ్చిపోతే ఎవరు రెస్పాన్స్‌’అంటూ హాస్యనటుడు బ్రహ్మానందం ఫొటోతో ఉన్న మీమ్‌ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

Tags :
|
|
|

Advertisement