Advertisement

  • పియర్సన్ క్లాస్‌రూమ్...ఉన్నత స్థాయి ఆంగ్ల పరీక్షలకు హాజరయ్యే వారికి ఆన్‌లైన్‌లోనే

పియర్సన్ క్లాస్‌రూమ్...ఉన్నత స్థాయి ఆంగ్ల పరీక్షలకు హాజరయ్యే వారికి ఆన్‌లైన్‌లోనే

By: chandrasekar Tue, 13 Oct 2020 2:48 PM

పియర్సన్ క్లాస్‌రూమ్...ఉన్నత స్థాయి ఆంగ్ల పరీక్షలకు హాజరయ్యే వారికి ఆన్‌లైన్‌లోనే


ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో విదేశాల్లో చదువుకోవాలని కోరుకునే వారికి మద్దతు ఇవ్వాలన్నతన లక్ష్యానికి అనుగుణంగా ప్రపంచ లెర్నింగ్ కంపెనీ పియర్‌సన్, ఉన్నత స్థాయి ఆంగ్ల పరీక్షలకు హాజరయ్యే వారికి పూర్తిగా ఆన్‌లైన్‌లోనే అధ్యాపకుల నిర్వహణలో విజయవంతమైన వ్యవస్థను విద్యార్థుల కోసం పియర్సన్ క్లాస్‌రూమ్ ద్వారా అందుబాటులోకి తీసుకు వచ్చింది.

ఇనిస్టిట్యూట్లు, అధ్యాపకులు ,విద్యార్థులు, అడ్మినిస్ట్రేషన్ విభాగం నిర్వాహకులకు మద్దతుగా ఈ వేదికను తీర్చదిద్దారు. ఇది ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన విశ్వసనీయ ఆంగ్ల భాషా పరీక్ష తయారీ సంస్థ E2 లాంగ్వేజ్ దీనికి మద్దతు యిస్తున్నది. E2 Languageతో భాగస్వామ్యం గురించి పియర్సన్ ఇండియా సేల్స్ ,మార్కెటింగ్ ఉపాధ్యక్షుడు రామానంద ఎస్.జి మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రపంచం ఊహించని సవాళ్లను ఎదుర్కొంటుంది. విద్యా వ్యవస్థ వేగంగా వర్చువల్ విధానానికి వెళడం, ఆన్‌లైన్ లెర్నింగ్ పరిష్కరణల కోసం వృద్ధి చెందుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విద్యాసంస్థలు నిపుణులను ఆశ్రయిస్తుండగా, అత్యాధునిక ఉత్పత్తులు, సేవలను అలవర్చుకునేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి. పియర్సన్‌లో, వర్చువల్ తరగతులలో అర్ధవంతమైన పాఠాలను బోధించేందుకు శిక్షణ పొందిన అధ్యాపకుల ప్రాముఖ్యతను, అలాగే విద్యార్థులకు ధ్రువీకరించిన అధ్యయన సామగ్రి, మాక్ పరీక్షలతో సహాయం అవసరమని మేము గుర్తించామని తెలిపారు.

Tags :
|

Advertisement