Advertisement

  • పెంపుడు కోళ్లతో కలిసి ఇంటికి వచ్చిన నెమలి ..అటవీ అధికారులకు అప్పగించిన కోళ్ల యజమాని ..

పెంపుడు కోళ్లతో కలిసి ఇంటికి వచ్చిన నెమలి ..అటవీ అధికారులకు అప్పగించిన కోళ్ల యజమాని ..

By: Sankar Wed, 22 July 2020 3:51 PM

పెంపుడు కోళ్లతో కలిసి ఇంటికి వచ్చిన నెమలి ..అటవీ అధికారులకు అప్పగించిన కోళ్ల యజమాని ..



మన జాతీయ పక్షి నెమలి ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ..అందుకే నెమలికి ఏ చిన్న హాని చేసిన కూడా కఠిన శిక్షలు పడతాయి ..అయితే ఇలాగె తాను పెంచుకునే కోళ్లతో కలిసి ఇంటికి వచ్చిన నెమలిని జాగ్రత్తగా ఫారెస్ట్ అధికారులకు అప్పగించాడు ఒక వ్యక్తి ...

ఇంటికి నెమలి రావడంతో ఆశ్చర్యపోయిన కోళ్ల యజమాని దాన్ని పట్టుకొని అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే అక్కడికి వెళ్లిన అటవీ శాఖ అధికారులు నెమలిని తీసుకొని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఈ ఘటన ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలోని బీరవల్లిలో చోటు చేసుకుంది.

ఈ విషయమై మధిర ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ మాట్లాడుతూ.. అటవీ జంతువులు గ్రామాల్లోకి వస్తే సమాచారం ఇవ్వాలని స్థానికులను కోరారు. డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్లతో కలిసి నెమలిని తీసుకెళ్లి ఎర్రుపాలెం మండలం రేమిడిచర్లలోని అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు.

Tags :
|
|

Advertisement