Advertisement

  • కేంద్రంలో మోడీ , రాష్ట్రంలో కెసిఆర్ రైతుల జీవితాలను నాశనం చేస్తున్నారు.. పీసీసీ చీఫ్ ఉత్తమ్

కేంద్రంలో మోడీ , రాష్ట్రంలో కెసిఆర్ రైతుల జీవితాలను నాశనం చేస్తున్నారు.. పీసీసీ చీఫ్ ఉత్తమ్

By: Sankar Fri, 02 Oct 2020 4:38 PM

కేంద్రంలో మోడీ , రాష్ట్రంలో కెసిఆర్ రైతుల జీవితాలను నాశనం చేస్తున్నారు.. పీసీసీ చీఫ్ ఉత్తమ్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టంతో వ్యాపారులకు అవకాశం కల్పించారని టీ పీసీసీ అధ్యక్షుడు ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి అన్నారు.

అదానీ, అంబానీ, అమెజాన్‌కు లాభం చేకూరే విధంగా మోదీ నిర్ణయం ఉంద‌ని ఆయన విమ‌ర్శించారు. వ్య‌వ‌సాయ బిల్లులతో రైతుల‌కు న‌ష్టం క‌లుగుతుంద‌న్నారు. కేంద్రంలో మోదీ, రాష్ర్టంలో కేసీఆర్ రైతుల జీవితాల‌ను నాశ‌నం చేస్తున్నార‌ని , మాయ‌మాట‌ల‌తో మోసం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో లక్ష రూపాయల రుణ మాఫీ చేయలేదని, పంట నష్ట పరిహారం ఇవ్వడం లేదని ఉత్త‌మ్ పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణ రైతు ద్రోహి అని, పచ్చి అబద్ధాలతో కేసీఆర్ మోసం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు. వ్యవసాయ చట్టాలను అమలు చేయబోమని శాసనసభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.

ఇక సీనియర్ నేత జానా రెడ్డి మరొక సమావేశంలో మాట్లాడుతూ వ్యవసాయ బిల్లులను పార్లమెంటరీ సంప్రదాయాన్ని అనుసరించకుండా మూజువాణి ఓటుతో తీసుకోచ్చారు. ఈ బిల్లులు వ్యవసాయదారులకి, వినియోగదారులకు ప్రమాదంగా మారే అవకాశం ఉంది. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. వీటి వల్ల మార్కెట్ వ్యవస్థ పోయి కార్పొరేట్ వ్యవస్థ వచ్చే అవకాశం ఉంది. దీనికి వ్యతిరేకంగా సంతకాలను సేకరించి కేంద్రానికి అందచేస్తాం' అని తెలిపారు

Tags :
|
|

Advertisement