Advertisement

  • గంగూలీ ఆసియా కప్ రద్దు ప్రకటనపై స్పందించిన పిసిబి

గంగూలీ ఆసియా కప్ రద్దు ప్రకటనపై స్పందించిన పిసిబి

By: Sankar Thu, 09 July 2020 4:49 PM

గంగూలీ ఆసియా కప్ రద్దు ప్రకటనపై స్పందించిన పిసిబి



బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ ఆసియా కప్ రద్దు అయినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే .. సౌరవ్‌ గంగూలీ చేసిన వ్యాఖ్యలపై పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు మీడియా డైరెక్టర్‌ శామ్యూల్‌ హసన్‌ బర్నీ స్పందించారు. ఆ మాటలకు ఎలాంటి విలువ లేదంటూ కొట్టి పారేశారు. ఆసియా కప్‌ రద్దు విషయాన్ని ధృవీకరించాల్సింది ఆసియన్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ ( ఏసీసీ) అని తెలిపారు. ‘ఇలాంటి ప్రకటనలు కేవలం ఏసీసీ ప్రెసిడెంట్‌ మాత్రమే చేయాలి. గంగూలీ వ్యాఖ్యాలు మ్యాచ్‌ షెడ్యూల్‌కు సంబంధించిన ప్రొసిడింగ్స్‌ మీద ఎలాంటి ప్రభావాన్ని చూపలేవు..గంగూలీ ప్రతి వారం ఏదో ఒకటి ప్రకటిస్తూ ఉంటారు, ఆయన మాటలకు విలువ లేదు అని అన్నారు. దీనికి సంబంధించి ఏసీసీ ప్రెసిడెంట్‌ నజ్నూల్‌ హసన్‌ మాత్రమే ప్రకటన చేయాలి. మాకు తెలిసినంత వరకు ఏసీసీ సమావేశం షెడ్యూల్ ఇంకా ప్రకటించబడలేదు’ అని పేర్కొన్నారు.

ప్రముఖ ఇంగ్లీష్‌ ఛానెల్‌తో జరిగిన ఇన్‌స్టాగ్రామ్ లైవ్ సెషన్‌లో గంగూలీ ఆసియా కప్‌ 2020 రద్దైనట్లు పేర్కొన్నారు. కరోనా పరిస్థితుల మధ్య ఎప్పుడు మ్యాచ్‌లు జరుగుతాయో చెప్పలేమని గంగూలీ పేర్కొన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అణుగుణంగా ముందుకు వెళతామని, ఆటగాళ్ల ఆరోగ్యమే ముఖ్యమని గంగూలీ పేర్కొన్నారు.షెడ్యూల్ ప్రకారం ఆసియాకప్‌ను పాకిస్తాన్ నిర్వహించాల్సి ఉంది. కానీ బీసీసీఐ భద్రతా విషయాలకు సంబంధించి అభ్యంతరం తెలపడంతో మ్యాచ్‌ జరగాల్సిన వేదికను దుబాయ్‌కు మార్చారు. సెప్టెంబరులో ఈ టోర్ని జరగాల్సి ఉండగా గురువారం ఆసియా క్రికెట్ మండలి సమావేశం జరగనుంది. అయితే దీనికి ముందే ఈ టోర్నీ రద్దైనట్లు గంగూలీ చెప్పడం చర్చనీయాంశం అయ్యింది..

అయితే ఈ ఏడాది ఐపీయల్ వాయిదా పడటంతో ..ఎలాగైనా సరే ఐపీయల్ నిర్వహించాలని బీసీసీఐ పట్టుదలతో ఉంది ..అయితే టి ట్వంటీ వరల్డ్ కప్ రద్దు అయితేనే ఐపీయల్ నిర్వహించడానికి సమయం దొరుకుతుంది ..అయితే ఐసీసీ మాత్రం టి ట్వంటీ వరల్డ్ కప్ మీద ఎటువంటి క్లారిటీ ఇవ్వడం లేదు ..మరో వైపు ఐపీయల్ ను ఆపడం కోసం ఆసియా కప్ ఎట్టి పరిస్థితుల్లో అయిన నిర్వహించాలని పాకిస్తాన్ చూస్తుంది ..

Tags :
|

Advertisement