Advertisement

  • కరోనా కారణంగా భారత్ నుంచి ప్రపంచ కప్ తరలిపోవొచ్చు ...అక్కసు వెళ్లగక్కిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు

కరోనా కారణంగా భారత్ నుంచి ప్రపంచ కప్ తరలిపోవొచ్చు ...అక్కసు వెళ్లగక్కిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు

By: Sankar Tue, 01 Dec 2020 9:29 PM

కరోనా కారణంగా భారత్ నుంచి ప్రపంచ కప్ తరలిపోవొచ్చు ...అక్కసు వెళ్లగక్కిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు


పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మరోసారి బీసీసీఐ పై తన అక్కసు చూపించాడు. భారత్ లో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా వచ్చే ఏడాది భారత్ వేదికగా జరగనున్న ఐసీసీ ప్రపంచ టీ20 ప్రపంచ కప్ ను అక్కడి నుండి తరలించే అవకాశం ఉందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ వసీం ఖాన్ అన్నారు.

కరోనా కారణంగా భారత్ లో జరిగే ఈ టోర్నీ పై ఇంకా కొంత అనిశ్చితి ఉంది. అయితే దీనిని యూఏఈ వేదికగా నిర్వహించేందుకు కూడా అవకాశం ఉన్నట్లు ఆయన తెలిపారు. కానీ దీని పై ఏప్రిల్ నాటికి స్పష్టత వస్తుంది అని ఖాన్ చెప్పారు.

అయితే 2021 ప్రపంచ టీ20 వచ్చే ఏడాది అక్టోబర్ నుంచి నవంబర్ మధ్య భారత్ వేదికగా జరగనుంది. అయితే ఈ టోర్నీ ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సి ఉండగా.. అది వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఆ తర్వాత దీని హోస్టింగ్ హక్కులు బీసీసీఐ కి అప్పగించింది

Tags :
|

Advertisement