Advertisement

  • ఐపీఎల్ 2020 సీజన్ లో ఆడదానికి యువరాజ్ సింగ్‌కి పీసీఏ ఆహ్వానం

ఐపీఎల్ 2020 సీజన్ లో ఆడదానికి యువరాజ్ సింగ్‌కి పీసీఏ ఆహ్వానం

By: chandrasekar Sat, 15 Aug 2020 4:45 PM

ఐపీఎల్ 2020 సీజన్ లో ఆడదానికి యువరాజ్ సింగ్‌కి పీసీఏ ఆహ్వానం


పీసీఏ నుంచి టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్‌కి ఊహించని విధంగా పిలుపు వెళ్లింది. 2019 వన్డే ప్రపంచకప్ సమయంలో రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ సింగ్‌‌‌ని మళ్లీ పంజాబ్ టీమ్ తరఫున ఆడించాలని పీసీఏ ఆశిస్తోంది. ఈ మేరకు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని పంజాబ్ టీమ్‌ని మళ్లీ ఆడాలని పీసీఏ కోరినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కానీ ఈ పిలుపుపై ఇంకా యువరాజ్ సింగ్ స్పందించలేదు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌ని టీమిండియా గెలవడంలో క్రియాశీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్. భారత్ తరఫున 2017లో ఆఖరిగా మ్యాచ్‌ ఆడాడు. వరల్డ్‌కప్‌ల హీరోగా పేరొందిన యువీకి రెండేళ్ల పాటు జట్టులో చోటివ్వని భారత సెలక్టర్లు ఆఖరికి వీడ్కోలు మ్యాచ్‌‌ ఆడే అవకాశం కూడా ఇవ్వలేదు.

ఓ అనామక క్రికెటర్ తరహా రిటైర్మెంట్ ప్రకటించిన యువరాజ్ సింగ్ ఆ తర్వాత రెండు విదేశీ ప్రైవేట్ లీగ్స్‌లో కూడా ఆడేశాడు. దాంతో ఇప్పుడు ఆ రిటైర్మెంట్‌ని వెనక్కి తీసుకోవాలన్నా, ఆ విదేశీ లీగ్స్‌ ఆడటం యువీకి అడ్డంకిగా మారింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిబంధనల ప్రకారం భారత క్రికెటర్ ఎవరూ రిటైర్మెంట్ ప్రకటించకుండా విదేశీ ప్రైవేట్ లీగ్స్‌లో ఆడటానికి వీల్లేదు. రిటైర్మెంట్ తర్వాత విదేశీ లీగ్స్‌లో ఆడిన క్రికెటర్ మళ్లీ ఎట్టి పరిస్థితుల్లో బీసీసీఐ ఆధ్వర్యంలో నడిచే టోర్నీల్లో ఆడేందుకు అనుమతించరు. యూఏఈ వేదికగా టీ10 లీగ్‌ ఆడిన భారత మాజీ స్పిన్నర్ ప్రవీణ్ తంబే ఇటీవల రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఐపీఎల్ 2020 సీజన్‌లో ఆడాలని ప్రయత్నించాడు. అతడ్ని ఐపీఎల్ వేలంలో రూ.20 లక్షలకి కోల్‌కతా నైట్‌రైడర్స్ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసింది. కానీ బీసీసీఐ ఆధ్వర్యంలో జరిగే ఐపీఎల్‌లో ఆడేందుకు అతను అనర్హుడిగా బీసీసీఐ తేల్చి చెప్పేసింది.

Tags :
|
|

Advertisement