Advertisement

ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగింపు

By: Sankar Fri, 18 Sept 2020 4:13 PM

ప్లే స్టోర్ నుంచి పేటీఎం యాప్ తొలగింపు


ప్రముఖ డిజిటల్‌ పేమెంట్‌ యాప్‌ పేటీఎం గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి అదృశ్యమైంది. వన్‌ 97 కమ్యూనికేషన్స్‌ యాజమాన్యంలోని యాప్‌ గూగుల్‌ ప్లే స్టోర్‌లో సెర్చ్‌ చేసినప్పుడు కనిపించలేదు. ఐతే పేటీఎం ఫర్‌ బిజినెస్‌, పేటీఎం మనీ, పేటీఎం మాల్‌, తదితర కంపెనీ యాజమాన్యంలోని అన్ని ఇతర యాప్‌లు కూడా ప్లే స్టోర్‌లో అందుబాటులో ఉన్నాయి.

యాపిల్‌ యాప్‌ స్టోర్‌లో మాత్రం యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్లే స్టోర్‌ నుంచి యాప్‌ తొలగించడంపై పేటీఎం ట్విటర్లో స్పందించింది. కొత్త డౌన్‌లోడ్‌లు లేదా అప్‌డేట్‌ కోసం గూగుల్‌ ప్లే స్టోర్‌లో పేటీఎం ఆండ్రాయిడ్‌ యాప్‌ తాత్కాలికంగా అందుబాటులో లేదు. త్వరలోనే యాప్‌ మళ్లీ ప్లే స్టోర్‌లోకి వస్తుంది. యూజర్ల డబ్బు అంతా పూర్తిగా సురక్షితం.

ఎప్పటిలాగే మీ పేటీఎం యాప్‌ను ఉపయోగించుకోవచ్చు అని పేర్కొంది. ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ ద్వారా కంపెనీ కొత్త నిబంధనలను ఉల్లంఘించినట్లు ఆరోపణలు రావడంతో యాప్‌ను గూగుల్‌ తొలగించింది.

Tags :
|
|

Advertisement