Advertisement

  • తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్ కు రూ.12,801.67 కోట్లు చెల్లింపు

తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్ కు రూ.12,801.67 కోట్లు చెల్లింపు

By: chandrasekar Tue, 13 Oct 2020 10:11 AM

తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్ కు రూ.12,801.67 కోట్లు చెల్లింపు


తెలంగాణలో విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కు రూ.12,801.67 కోట్లు చెల్లింపులు చేశారు. పేద విద్యార్థులు గొప్ప చదువు చదవాలన్న సంకల్పంతో చేపట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. చదువుకు ఆటంకం కలుగకుండా ఉండేందుకు ఏటా ఫీజులను ఎప్పటికప్పుడు చెల్లిస్తున్నది.

పేద విద్యార్థుల కోసం తెలంగాణ ఏర్పడ్డప్పటి నుంచి ఇప్పటి దాకా అంటే 2014-2015 నుంచి 2019-2020 విద్యా సంవత్సరం వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థులకు సంబంధించి రూ.12,801.67 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లింపులు చేసింది. ఇప్పుడు కరోనా వల్ల ఆర్థిక సమస్యలు ఎదురైనా, ఫీజుల చెల్లింపును కొనసాగిస్తున్నది.

ప్రస్తుతం రాష్ట్రంలో 2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను 52.82 శాతం చెల్లించింది. సెప్టెంబర్‌ చివరినాటికి మొత్తం రూ.1,050.48 కోట్లను విడుదల చేసింది. విద్యాసంస్థలు ఇంకా ప్రా రంభం కాకున్నా ఇంటర్‌, డిగ్రీ, ఇతర పలు వృత్తివిద్యాకోర్సుల్లో ఆన్‌లైన్‌ అడ్మిష న్ల ప్రక్రియ కొనసాగుతున్నది.

కరోనా వల్ల ఆలస్యంగా ప్రారంభం కావటంతో ఈ నేపథ్యంలో 2020-21 విద్యాసంవత్సరానికి ఫీజురీయింబర్స్‌మెంట్‌ దరఖాస్తులను స్వీకరించనున్నాం. టీఎస్‌ఈపాస్‌ ద్వారా ఈ నెల 14 నుంచి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నాం. డిసెంబర్‌ 31 వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కొరకు దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. దీనివల్ల పేద ప్రజలకు ఆటంకం లేకుండా విద్యా కోర్సులు అందనున్నాయి.

Tags :
|
|

Advertisement