Advertisement

పుష్ప ఐటెం సాంగ్ లో వెంకటేష్ హీరోయిన్ ..?

By: Sankar Tue, 30 June 2020 8:49 PM

పుష్ప ఐటెం సాంగ్ లో వెంకటేష్ హీరోయిన్ ..?



సుకుమార్ సినిమా అంటే ఐటెం సాంగ్స్ బాగా ఫేమస్ అవుతాయి ఆర్య సినిమా నుంచి రంగస్థలం వరకు సుకుమార్ సినిమాల్లో ఐటెం సాంగ్స్ అన్ని సూపర్ హిట్టే .అందుకే సుకుమార్ సినిమా అనగానే ఐటెం సాంగ్ లో నటించే హీరోయిన్ ఎవరా అని అభిమానులు ఎదురు చూస్తారు ..అయితే అల..వైకుంఠపురం వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత అల్లు అర్జున్ , సుకుమార్ తో సినిమా చేస్తున్నాడు ..పుష్ప అనే టైటిల్ పెట్టారు ..

సెట్‌పైకి వెళ్లడానికి సిద్ధంగా ఉన్న ఈ చిత్రాన్ని కరోనా మహమ్మారి అడ్డుకుంది. లేదంటే ఈపాటికే షూటింగ్ మొదలయ్యేది. ఇక ఈ సినిమాలో నటించే పాత్రల విషయంలో రోజుకొక వార్త పుట్టుకొస్తున్న విషయం తెలిసిందే. అందులో ముఖ్యంగా సుకుమార్ సినిమాలంటే తప్పనిసరిగా ఉండే ఐటమ్ సాంగ్‌లో నర్తించే నటి గురించి అనేకానేక వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతుల్లా ఈసారి సుకుమార్ సినిమాలో ఐటమ్ సాంగ్‌కు సెలక్ట్ అయినట్లుగా ఈ మధ్య ఓ వార్త వినిపించింది. ఆ తర్వాత అదే పాత్ర కోసం మరో ఇద్దరు బాలీవుడ్ భామల పేర్లు కూడా వినిపించాయి. కానీ ఇప్పుడు ఈ ఐటమ్ సాంగ్‌కు బాలీవుడ్ భామలు కాకుండా.. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా గుర్తింపు పొందుతున్న నటి పేరు వినబడుతుంది.

ఆర్ఎక్స్ 100’ చిత్రంలో అందరి మనసులను దోచుకున్న బ్యూటీ పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ చేసేందుకు సెలక్ట్ అయినట్లుగా తాజాగా ఫిల్మ్ సర్కిల్స్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఆ మధ్య బెల్లంకొండ సాయిశ్రీనివాస్ సినిమాలో పాయల్ ఓ స్పెషల్ సాంగ్‌లో నర్తించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సరైన పాత్రల కోసం వేచి చూస్తున్న పాయల్‌కు ఈ ఐటమ్ అవకాశం రావడం నిజంగా వరమనే చెప్పుకోవాలి.

Tags :
|

Advertisement