Advertisement

  • ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ లో ఉన్న అద్దె బస్సుల్లో పనిచేసే డ్రైవర్లను ఆదుకోవాలని కోరిన పవన్ కళ్యాణ్

ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ లో ఉన్న అద్దె బస్సుల్లో పనిచేసే డ్రైవర్లను ఆదుకోవాలని కోరిన పవన్ కళ్యాణ్

By: chandrasekar Mon, 15 June 2020 3:43 PM

ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ లో ఉన్న అద్దె బస్సుల్లో పనిచేసే డ్రైవర్లను ఆదుకోవాలని  కోరిన పవన్ కళ్యాణ్


ఆటో, క్యాబ్ డ్రైవర్లను ఆర్థిక సాయం అందించిన వైసీపీ ప్రభుత్వం వారిని కూడా ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ లో ఉన్న అద్దె బస్సుల్లో పనిచేసే డ్రైవర్లను ఆదుకోవాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. లాక్‌డౌన్ మొదలైనప్పటి నుంచి జీతాలు అందకపోవడంతో డ్రైవర్ల కుటుంబాలు అగచాట్ల పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. సుమారు 8 వేల మంది డ్రైవర్లు ఆ అద్దె బస్సుల్లో ఉద్యోగాలు చేస్తున్నారని జనసేనాని పవన్ కళ్యాణ్ అన్నారు.

మార్చి నెల నుంచి తమకు జీతాలు లేకపోవడంతో జీవనం చాలా కష్టంగా మారిందని డ్రైవర్లు పార్టీ దృష్టికి తీసుకువచ్చారని, ఆ కుటుంబాల గురించి రాష్ట్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించి తగిన రీతిలో ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. డ్రైవింగ్‌లో పదేళ్ల పైబడిన అనుభవం ఉన్నా వీరికి తక్కువ వేతనాలే అందుతున్నాయని గుర్తు చేశారు. ఈ డ్రైవర్లు ఆర్టీసీ ఉద్యోగులు కారనీ, అద్దె బస్సుల యజమానులే ఆ బాధ్యత చూసుకోవాలని ప్రభుత్వం, సంస్థ భావించడం సరికాదని పవన్ అభిప్రాయపడ్డారు.

ఆర్టీసీకి అద్దె బస్సుల ద్వారా సేవలందించిన కార్మికులు అనే దృక్పథంతో వారికి ఆర్థిక తోడ్పాటు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆటో, టాక్సీ డ్రైవర్లకు సహాయం చేసిన ప్రభుత్వం ఆర్టీసీ అద్దె బస్సులకు పని చేస్తున్న డ్రైవర్ల కష్టాల గురించీ ఆలోచన చేయాలన్నారు. ఈ అద్దె బస్సుల నిర్వహణ, మరమ్మతులపై ఆధారపడ్డ శ్రామిక్ విభాగం చిరుద్యోగుల గురించి కూడా సంస్థ ఆలోచించాలని కోరారు.

Tags :

Advertisement