Advertisement

  • నివర్ తుఫాన్ బాధితుల్ని ఆదుకోవాలని తన నివాసంలో దీక్షలో కూర్చున్న పవన్ కళ్యాణ్...

నివర్ తుఫాన్ బాధితుల్ని ఆదుకోవాలని తన నివాసంలో దీక్షలో కూర్చున్న పవన్ కళ్యాణ్...

By: chandrasekar Mon, 07 Dec 2020 2:35 PM

నివర్ తుఫాన్ బాధితుల్ని ఆదుకోవాలని తన నివాసంలో దీక్షలో కూర్చున్న పవన్ కళ్యాణ్...


నివర్ తుఫాన్ కారణంగా ఏర్పడిన వైపరీత్యాలకు బాధితుల్ని ఆదుకోవాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ సర్కార్‌ను డిమాండ్ చేశారు. ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు ఉంచి డిసెంబర్ 6 వరకు అల్టిమేటం ఇచ్చారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో దీక్షకు దిగారు.

రైతాంగానికి తుఫాన్ వల్ల నష్ట౦ ఏర్పడిన దానికి పరిహారంగా రూ.35వేలు, తక్షణ సాయంగా రూ.10 వేలు ఇవ్వాలన్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ డిమాండ్ కు ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో రైతాంగానికి అండగా తన నివాసంలో ఉదయం 10గం.లకు దీక్షలో కూర్చున్నట్లు పార్టీ ప్రకటించింది.

జగన్ సర్కార్ రాష్ట్రవ్యాప్తంగా నివర్ తుఫాన్‌తో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవాలని రెండు రోజుల క్రితం పవన్ డిమాండ్ చేశారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. పంట నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రైతు కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదన్నారు.

ఈ ఏడాదిలోనే మూడోసారి పంట నష్టపోయి రైతులు తన దగ్గర ఆవేదన వ్యక్తం చేశారన్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, మద్యపానం ద్వారా వచ్చిన ఆదాయాన్ని రైతులకు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రైతులకు మద్దతుగా ఈనెల 7న నిరసన దీక్షలు చేపడతామని హెచ్చరించారు. చెప్పిన విధంగానే దీక్షకు దిగారు.

Tags :
|

Advertisement