Advertisement

  • ఆంధ్రప్రదేశ్‌లో 2024 కంటే ముందుగానే ఎన్నికలు రావచ్చన్న పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్‌లో 2024 కంటే ముందుగానే ఎన్నికలు రావచ్చన్న పవన్ కళ్యాణ్

By: chandrasekar Thu, 19 Nov 2020 10:26 AM

ఆంధ్రప్రదేశ్‌లో 2024 కంటే ముందుగానే ఎన్నికలు రావచ్చన్న పవన్ కళ్యాణ్


జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యాలయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 2024 కంటే ముందుగానే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశమంతా ఒకేసారి ఎన్నికలు రావాలన్నదే తన అభిప్రాయం అని వ్యాఖ్యానించారు. నాయకత్వ లోపం కారణంగా అభిమానులు పార్టీ వైపు రావడం లేదని వ్యాఖ్యానించారు. వైసీపీకి ప్రజలు అత్యధిక సీట్లిచ్చి గౌరవించారని, కానీ ఆ పార్టీ గౌరవాన్ని నిలబెట్టుకొనే పరిస్థితుల్లో లేదని ఆయన విమర్శించారు. 2014లో ఏపీ ప్రయోజనాల కోసమే వేరే పార్టీలకు మద్దతిచ్చానని ఆయన చెప్పారు. కానీ, అలాంటి టీడీపీ ప్రస్తుతం క్షేత్రస్థాయిలో ఇబ్బంది పడుతోందన్నారు. ఈ రకంగా ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ప్రస్తుతం ఏపీ లోని అమరావతి పరిరక్షణ సమితి నేతలతో పవన్ కల్యాణ్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ అమరావతి ఉద్యమకారులపై వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. బంగారం పెట్టుకొని ఉద్యమం చేయకూడదా? ఉద్యమం అంటే చిరిగిన బట్టలు వేసుకొని ఉండాలా? అని పవన్‌ ప్రశ్నించారు. ఉద్యమానికి, సామాజిక వర్గానికి ముడిపెట్టడం సరికాదన్నారు. రాజధానిని మూడు ప్రాంతాల మధ్య సమస్యగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రైతులకు తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని భరోసా కల్పించారు. రైతులకు న్యాయం చేసే విషయంలో ఎప్పటికీ వెనకడుగు వేసేదిలేదని పవన్‌ స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతే ఉంటుందని బీజేపీ తనకు స్పష్టంగా చేప్పిందన్నారు. రాజధానిని తరలిస్తున్నట్లు ప్రభుత్వం అధికారికంగా చెప్పలేదని, అధికారికంగా ప్రకటించాక మా పార్టీ కార్యాచరణ చెబుతామని పవన్‌ వెల్లడించారు. గత ఎన్నికల్లో వేరే పార్టీలకు మద్దతిచ్చిన విషయం తెలిసిందే.

Tags :

Advertisement