Advertisement

  • బ్రిటన్ కరెన్సీ కాయిన్స్ మీద జాతిపిత మహాత్మాగాంధీ చిత్రం

బ్రిటన్ కరెన్సీ కాయిన్స్ మీద జాతిపిత మహాత్మాగాంధీ చిత్రం

By: chandrasekar Mon, 03 Aug 2020 10:15 AM

బ్రిటన్ కరెన్సీ కాయిన్స్ మీద జాతిపిత మహాత్మాగాంధీ చిత్రం


మన దేశానికీ స్వాతంత్య్రాన్ని అందించిన జాతిపిత మహాత్మాగాంధీ. భారత జాతిపిత మహాత్మాగాంధీ చిత్రం మనదేశ కరెన్సీ నోట్లు, కాయిన్స్ మీద ఉంటుంది. ఇప్పుడు యునైటెడ్ కింగ్ డమ్ తయారు చేసే కరెన్సీ కాయిన్స్ మీద కూడా మహాత్ముడి చిత్రం కొలువుదీరనుంది. భారత్‌లో 1987 నుంచి కరెన్సీ నోట్ల మీద మహాత్మాగాంధీ ఫొటో ఉంటుంది. యూకేలో కరెన్సీ మీద కొలువవుతున్న తొలి తెల్లజాతీయేతరుడు గాంధీనే కావడం విశేషం. ది రాయల్ మింట్ అడ్వైజరీ కమిటీ దీనిపై పరిశీలిస్తోంది.

బ్రిటన్ దేశంలో అభివృద్దిలో కేవలం తెల్లవారేకాదు. అన్ని వర్గాల వారి కృషి ఉందంటూ మాజీ కన్జర్వేటివ్ అభ్యర్థి జెహ్రా జైదీ ‘We too built Britain’ పేరుతో ఉద్యమాన్ని నడుపుతున్నారు. బ్లాక్, ఏసియన్, మైనారిటీ, ఎత్నిక్ ప్రముఖులను కూడా కరెన్సీ కాయిన్స్ మీద చేర్చాలంటూ ఉద్యమానికి మద్దతు ఇస్తున్న రిషి సునక్ అనే ఛాన్స్ లర్ ఈ మేరకు లేఖ రాశారు. ఆయా వర్గాల వారు కూడా బ్రిటన్ అభ్యున్నతికి ఎంతో కృషి చేశారన్నారు. ఇందులో భాగంగా మహాత్ముడి చిత్రం కొలువుదీరనుంది.

అందరూ కలసి కొన్ని తరాల పాటు కష్టపడి దేశాన్ని వృద్ధిలోకి తీసుకొచ్చారన్నారు. రాయల్ మింట్ అడ్వైజరీ కమిటీ అనేది స్వతంత్రంగా పనిచేస్తుంది. యూకేలో కరెన్సీ కాయిన్స్ మీద ఎవరెవరి, ఎలాంటి చిత్రాలు ముద్రించాలనే అంశంపై చాన్స్‌లర్‌కు సూచనలు ఇస్తుంటుంది. ప్రముఖులకు గుర్తింపు నివ్వడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆదర్శంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ విషయం మన దేశ జాతిపిత మహాత్మాగాంధీ పేరు ప్రఖ్యాతలు ప్రపంచ నలుమూలలు వ్యాపిస్తుంది.

Tags :
|

Advertisement