Advertisement

  • జాతిపిత మహాత్మాగాంధీ ముని మనువడు కరోనాతో మృతి

జాతిపిత మహాత్మాగాంధీ ముని మనువడు కరోనాతో మృతి

By: chandrasekar Mon, 23 Nov 2020 7:14 PM

జాతిపిత మహాత్మాగాంధీ ముని మనువడు కరోనాతో మృతి


దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్‌లో ఉంటున్న జాతిపిత మహాత్మాగాంధీ ముని మనుమడు సతీశ్‌ ధూపేలియా ఆదివారం కరోనా సోకి కన్నుమూశారు. న్యూమోనియా కారణంగా నెల రోజుల పాటు హాస్పిటల్‌లో చికిత్స పొందిన తర్వాత కరోనా సంబంధిత సమస్యలతో మరణించాడని ఆయన సోదరి ఉమా ధూపేలియా మెస్త్రీ ధ్రువీకరించారు. సతీశ్‌ గత మూడు రోజుల కిందటే 66వ పుట్టిన రోజును జరుపుకున్నారని తెలిపారు. సతీశ్‌ ధూపేలియా, ఉమా ధూపేలియా, కీర్తిమీనన్‌ మనీలాల్‌ గాంధీ వారసులు. ఆయన మహాత్మాగాంధీ సోదరుడు. దక్షిణాఫ్రికాలో ఉన్న సమయంలో అక్కడ నిర్వహించిన కార్యకలాపాలు ముందుకు తీసుకెళ్తున్నారు.

సతీశ్‌ తన జీవితంలో ఎక్కువ భాగం మీడియాలో గడిపారు. ముఖ్యంగా వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్‌గా కొనసాగారు. డర్బన్‌ సమీపంలోని ఫీనిక్స్‌ సెటిల్మెంట్‌ వద్ద మహాత్ముడు ప్రారంభించిన పనులను కొనసాగించేందుకు గాంధీ డెవలప్‌మెంట్‌ ట్రస్ట్‌కు సహాయ సహకారాలు అందించడంలో చురుగ్గా పని చేశారు. ఆయన నిరుపేదలకు సహాయం అందించడంలో అన్ని వర్గాల్లో పేఋ సంపాదించారు. ఆయన మరణంపై స్నేహితులు ఘన నివాళులర్పించారు. గొప్ప మానవతావాది అని రాజకీయ విశ్లేషకుడు లుబ్నా నద్వి అన్నారు. మహిళల కోసం ఎంతో కృషి చేశారని, ఏ సంస్థకైనా ఏదోవిధంగా సహాయం అందించేవాడని తెలిపారు.

Tags :
|

Advertisement